Optical Ilusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో 690 నెంబర్ ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి, అలా చేస్తే మీరు తోపు
Optical Ilusion: ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమా? మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇక్కడ ఉంది. దీన్ని సాధించేందుకు ప్రయత్నించండి. అది కూడా పది సెకన్లలోనే.
Optical Ilusion: ఆప్టికల్ ఇల్యూషన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. అందులో ఒకటి... నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్. అంటే ఆ ఆప్టికల్ ఇల్యూషన్లో నెంబర్లు మాత్రమే ఉంటాయి. అందులో భిన్నంగా ఉన్న నెంబర్‌ను మనం కనిపెట్టాలి. ఇక్కడ మేము అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో 960 అనే సంఖ్య ఎన్నోసార్లు ఉంది. వాటి మధ్యలో 690 అనే సంఖ్య ఇరుక్కుని ఉంది. అది ఎక్కడ ఉందో మీరు కనిపెట్టి చెప్పాలి. గంట సమయం ఇస్తే ఎవరైనా చెప్పేస్తారు. కేవలం 10 సెకన్లలోనే చెబితే మీ కంటి చూపు, మెదడు శక్తి సూపర్ అని ఒప్పుకోవచ్చు. ఒకసారి ప్రయత్నించి చూడండి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
పది సెకన్లలోనే ఆప్టికల్ ఇల్యూషన్ జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. మీరు నిజంగా చాలా తెలివైనవారు. మీకంటి చూపు చాలా పదునుగా ఉంది. అలాగే కంటి చూపు, మెదడు సమన్వయంతో పనిచేస్తున్నాయి. మీ మెదడు కూడా చాలా చురుగ్గా పనిచేస్తుందని అర్థం. ఇక జవాబు విషయానికి వస్తే 690 అనే నెంబరు ఆప్టికల్ ఇల్యూషన్లో చివరి నుంచి ఐదో నిలువ వరుసలో మధ్యలో ఉంది. అదే ఈ ఆప్టికల్ ఇల్యుషన్ జవాబు. ఈ జవాబును కనిపెట్టలేని వారు మెదడుకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీరు అనేక రకాల పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉండాలి.
కంటి చూపు, మెదడు ఎంత సమన్వయంగా ఉంటే మీ ఆలోచన తీరు, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అంతగా పెరుగుతుంది. మీరు ప్రతిరోజూ రకరకాల పజిల్స్‌ను ఆప్టికల్ ఇల్యూషన్లను సాల్వ్ చేయడం అలవాటు చేసుకోండి. కచ్చితంగా మెదడు పనితీరులో మార్పు వస్తుంది. కంటి చూపు కూడా పదును తేలుతుంది. ఆప్టికల్ ఇల్యూషన్లు తరచూ సాల్వ్ చేసేవారికి ఎన్నో మానసికపరమైన ప్రయోజనాలు కలుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కేవలం నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే కాదు, బొమ్మల ఆప్టికల్ ఇల్యూషన్లు కూడా ఉన్నాయి. బొమ్మలో ఉన్న మరొక బొమ్మను కనిపెట్టడమే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్. మీరు అలాంటివి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇవి మెదడుకు సవాలు విసురుతాయి. అది చక్కగా పనిచేసేలా చేస్తాయి.
ఇక ఆప్టికల్ ఇల్యూషన్ చరిత్ర విషయానికి వస్తే ఇప్పటికీ వాటి గురించి లోతుగా ఏ విషయాలు తెలియ రావడం లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చరిత్రకారులు చెబుతున్నది పరిగణలోకి తీసుకుంటే గ్రీకు దేశంలోనే ఆప్టికల్ ఇల్యూషన్లు తొలిసారిగా బయటపడ్డాయని చెబుతారు. ఆ దేశంలో అనేక చోట్ల పురాతన దేవాలయాలు భూగర్భం నుంచి వెలికి తీశారు. ఆ ఆలయాల గోడలపై ఆప్టికల్ ఇల్యూషన్లు పోలిన ఆధారాలు ఎన్నో కల్పించాయి. అప్పుడు నుంచి ఆ దేశంలోనే ఇవి పుట్టి ఉంటాయని నిర్ధారణకు వచ్చారు.
ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో చిత్రకారులు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరిస్తున్నారు. వీటిపై ఆదాయాన్ని పొంది జీవిస్తున్న వారు కూడా ఎంతో. మీకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తి ఉంటే సోషల్ మీడియాలో వీటికోసం వెతకండి. కచ్చితంగా మీకు అనేక లభిస్తాయి.
టాపిక్