Evening Snacks| సాయంత్రం వేళ.. ఈ స్పాంజ్ కేక్​ను ఆస్వాదించేయండి-evening snack eggless sponge cake recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Evening Snacks| సాయంత్రం వేళ.. ఈ స్పాంజ్ కేక్​ను ఆస్వాదించేయండి

Evening Snacks| సాయంత్రం వేళ.. ఈ స్పాంజ్ కేక్​ను ఆస్వాదించేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 09, 2022 06:15 PM IST

అసలే సాయంత్రం. పనులకు బ్రేక్ ఇచ్చి.. కాఫీనో, టీనో తాగాలని మనసు ఆరాటపడే సమయం. ఈ సమయంలో ఈ ఛాయ్​కు ఓ చక్కని స్నాక్​ తోడైతే.. ఆహా అనిపిస్తుంది. అది ఇంట్లోనే చేసుకునేదే అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పదార్థాలతోనే ఓ చక్కని హెల్తీ, టేస్టీ వంటకాన్ని చేసుకుని తింటే వచ్చే తృప్తే వేరు. అలాంటి వారికోసమే ఈ ఎగ్​ లెస్​ వెనీలా స్పాంజ్ కేక్.

ఎగ్ లెస్ వెనీలా స్పాంజ్ కేక్
ఎగ్ లెస్ వెనీలా స్పాంజ్ కేక్

Eggless Vanilla Sponge Cake | ఎగ్​లెస్ వెనీలా స్పాంజ్ కేక్​ పేరు వింటుంటేనే నోరూరుతుంది కదూ. కానీ ఇది ఇంట్లో తయారు చేసుకోగలమా అంటే చేసుకోవచ్చు మరి. కాస్త ఓపిక ఉంటే మెత్తని నోరూరించే ఎగ్​లెస్​ వెనిలా స్పాంజ్​ కేక్​ తయారు చేసుకోవచ్చు. దీనిని శాఖాహారులు కూడా హ్యాపిగా ఇంట్లో చేసుకుని.. ఇంటిల్లాపాది తినొచ్చు.

ఈ ఎగ్​లెస్​ వెనీలా స్పాంజ్ కేక్ తయారు చేయడానికి కేవలం 7 పదార్థాలే అవసరమవుతాయి. దీనిలో వెనీలా మాత్రమే కాకుండా వేరే ఫ్లేవర్​తో లేదా నచ్చిన ఫ్లేవర్​తో ఈ కేక్​ను సిద్ధం చేయవచ్చు.

కావాల్సిన పదార్థాలు

* ఫ్లోర్- ఒకటిన్నర కప్పు

* బేకింగ్ సోడా- అర టీ స్పూన్

* బేకింగ్​ పౌడర్-1 టేబుల్​ స్పూన్​

* కన్​డెన్స్​డ్ మిల్క్ - ముప్పావు కప్పు

* సాల్టడ్ బటర్- అరకప్పు

* పాలు- కప్పు

* వెనీలా ఎక్స్​ట్రాక్ట్- 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

బటర్​ను కరిగించి ఓ ట్రేలో వేయాలి. దానిలో కండెన్స్​డ్​ మిల్క్​లో వెనీలా ఎక్స్​ట్రాక్ట్ వేసి బాగా కలపాలి. దానిలో ఫ్లోర్​ వేసి.. బేకింగ్​ సోడా, బేకింగ్ పౌడర్ వేసి, పాలు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని 180 డిగ్రీల హీట్​లో ఉంచిన ఓవెన్​లో 35-40 నిమిషాలు కుక్​ చేయాలి.

ఓవెన్​ నుంచి బయటకు తీసిన తర్వాత కట్​ చేసుకుని.. సర్వ్ చేసుకుంటే.. అందరూ తినొచ్చు. టీ లేదా కాఫీతో దీనిని తీసుకుంటే చాలా ఈవెనింగ్​ని హ్యాపీగా గడిపేయవచ్చు.

WhatsApp channel