Fish | వింటర్‌లో చేపలు తింటున్నారా? తింటే చాలా మంచిదట-eating fish in winter is healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Fish In Winter Is Healthy

Fish | వింటర్‌లో చేపలు తింటున్నారా? తింటే చాలా మంచిదట

Himabindu Ponnaganti HT Telugu
Dec 16, 2021 04:52 PM IST

వింటర్‌లో చేపలు తినడం మేలు చేస్తుందంటున్నారు వైద్యులు. చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు తట్టుకునేలా, రోగ నిరోధక శక్తిని పెంచే చేపలు తినడం మంచిదట.

చలికాలంలో చేపలు తింటున్నారా?
చలికాలంలో చేపలు తింటున్నారా? (pexel)

వింటర్ సీజన్‌లో జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, ఇతర చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడుతుంటారు. రోగ నిరోధక శక్తి బలహీనపడడమే ఇందుకు కారణం. అయితే ఈ సీజ‌న్‌లో మ‌న‌ల్ని వ్యాధుల నుంచి ర‌క్షించేందుకు చేప‌లు బాగా ప‌నిచేస్తాయి. 

- చేప‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్క‌లంగా ఉంటాయి. రక్తలో ఉండే ట్రైగ్లిజరైడ్లను తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. తద్వారా వింటర్‌లో గుండె పోట్లు, మెదడులో రక్త నాళాలు చిట్లడం వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి.

- ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ర‌క్షిస్తాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ వంటి వాటి నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. 

- ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. చ‌ర్మం పొడిబార‌కుండా సుర‌క్షితంగా, మృదువుగా ఉండేలా చేస్తాయి.

నొప్పుల నుంచీ రక్షణ

- ఆర్థ‌రైటిస్‌, గౌట్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌ వారికి చ‌లికాలంలో నొప్పులు ఎక్కువ‌వుతుంటాయి. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాపుల‌ను త‌గ్గిస్తాయి. నొప్పుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 

- ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మెద‌డు, క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. చేప‌ల‌ను తింటే విట‌మిన్ డి పుష్క‌లంగా ల‌భిస్తుంది. 

- డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌ వారు చేప‌ల‌ను తింటే మేలు జ‌రుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

- మంచి నీటిలో పెరిగే చేపల కన్నా ఉప్పు నీటిలో పెరిగే చేపల్లో ఎక్కువగా ఒమేగా-3 ఫాటీ యాసిడ్లు ఉంటాయి. సాల్మన్, ట్యునా, సార్డైన్స్, మాకేరాల్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. 

WhatsApp channel

టాపిక్