Winter Health: చలికాలంలో దగ్గు, కఫం రాకుండా ఉండాలంటే ఈ రెండు పదార్థాలు కలిపి తినండి చాలు-eat these two ingredients together to prevent cough and phlegm in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Health: చలికాలంలో దగ్గు, కఫం రాకుండా ఉండాలంటే ఈ రెండు పదార్థాలు కలిపి తినండి చాలు

Winter Health: చలికాలంలో దగ్గు, కఫం రాకుండా ఉండాలంటే ఈ రెండు పదార్థాలు కలిపి తినండి చాలు

Hari Prasad S HT Telugu
Nov 20, 2024 04:30 PM IST

Winter Health: చలికాలంలో శ్లేష్మం, దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి నీరు ఉంటే ఆయుర్వేద రెమెడీని అనుసరించండి.

చలికాలంలో ఆరోగ్యం కాపాడుకోండిలా
చలికాలంలో ఆరోగ్యం కాపాడుకోండిలా (shutterstock)

చలికాలంలో చాలా మందికి రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది.  దీని వల్ల జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలు వస్తాయి.  జలుబు, దగ్గు తగ్గిపోయినా కఫం మాత్రం అంత సులువుగా పోదు. చలికాలంలో దాదాపు అందరూ కఫం వల్ల ఇబ్బందిపడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి మీరు సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు. ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజూ యాలకులు, లవంగాలు కలిపి చేసిన పొడిని తినాలి. దీన్ని తినడం వల్ల జలుబు, గొంతునొప్పి, దగ్గు పూర్తిగా దూరం అవుతాయి.

కఫాన్ని తగ్గించే చిట్కా

దగ్గు, కఫం రాకుండా ఉండాలంటే రోజూ లవంగాలు, యాలకుల పొడి తినాలి. లవంగాలు, చిన్న యాలకులు సమాన పరిమాణంలో తీసుకుని పాన్ మీద వేయించాలి. యాలకులు తొక్కతోనే ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ లవంగాలు, యాలకుల పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజూ తినండి. పావు స్పూను పొడిని తింటే చాలు. ఈ పొడిని శీతాకాలంలో రోజూ శనగపిండితో సమానంగా తీసుకోవడం వల్ల కూడా  శరీరంలో శ్లేష్మం ఏర్పడకుండా చలి, వేడి నుంచి జలుబు రాకుండా కాపాడుతుంది.

లవంగాలలో

లవంగాలలో దగ్గును తగ్గించడానికి సహాయపడే అనేక సమ్మేళనాలు ఉన్నాయి.  అందులో ఉండే ఫ్లేవనాయిడ్లు,  హైడ్రాక్సీఫెనైల్ ప్రొపెన్సెస్, యూజెనాల్, గాలిక్ ఆమ్లం, కెఫిక్ ఆమ్లం,  క్వెర్సెటిన్ వంటి సమ్మేళనాలు దగ్గును తగ్గిస్తాయి. ప్రతిరోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది.

యాలకులు

వాతావరణం చల్లగా ఉండే చాలు శరీరంలో కఫం సమస్య పెరుగుతుంది. ఇది దగ్గుకు, శ్వాస ఆడకపోవడానికి కూడా కారణమవుతుంది. చిన్న ఆకుపచ్చ యాలకుల్లో క్రియాశీల పదార్ధం సినోల్ ఉంటుంది. ఇది యాంటీమైక్రోబయల్, క్రిమినాశకంగా పనిచేస్తుంది. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి చలికాలంలో యాలకులను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని పొడిని చేసి ఒక డబ్బాలో వేసి దాచుకోవాలి.  ఆ రెండు పొడులను చిటికెడు తీసుకుని తేనె కలుపుకుని తినాలి. ఇది దగ్గు రాకుండాన ఎంతో ఉపయోగపడుతుంది.

దగ్గును, కఫాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎన్నో రెమెడీలు ఉన్నాయి. నల్ల మిరియాలను పొడి చేసి దాచుకోవాలి. గోరువెచ్చటి పాలల్లో అర స్పూను మిరియాల పొడి వేసి, తేనె వేసి కలుపుకుని తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వల్ల చలికాలంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

బాదం పప్పుతో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రాత్రిపూట బాదం గింజలను నీటిలో నానబెట్టాలి. ఉదయం అయ్యాక పైన బాదం తొక్కను తీసేయాలి. ఆ బాదం పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్టులో వెన్న కలుపుకుని తాగుతూ ఉండాలి.

అల్లం రసంలో తేనె కలుపుకుని తాగుతూ ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దగ్గు రాకుండా ఉంటుంది. ఉల్లిపాయ రసంలో కూడా తేనె కలుపుకుని తాగినా దగ్గు, కఫం రాకుండా ఉంటాయి.

 

 

Whats_app_banner