Blood Sugar : సులభమైన పద్ధతిలో షుగర్​ను ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..-easy way to reduce blood sugar levels in natural way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Blood Sugar : సులభమైన పద్ధతిలో షుగర్​ను ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..

Blood Sugar : సులభమైన పద్ధతిలో షుగర్​ను ఇలా కంట్రోల్ చేసుకోవచ్చు..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 30, 2022 01:09 PM IST

మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే బ్లడ్​ షుగర్​ స్థాయిని తగ్గించుకోవడానికి కేవలం 15 రోజుల్లో, రక్తంలో చక్కెరను చాలా తగ్గించవచ్చు. ఈ 5 నియమాలను పాటించండి.

<p>బ్లడ్​ షుగర్</p>
బ్లడ్​ షుగర్

Reduce Blood Sugar Level : దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో పోరాడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి సంవత్సరం సగటున 1.5 మిలియన్ మంది మధుమేహం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సంఖ్య పెరుగుతోంది. అయితే దీనిని తగ్గించుకోవడానికి చాలామంది కుప్పలు తెప్పలుగా మందులు వాడుతారు. దానితో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తే.. బ్లడ్​ షుగర్​ లెవల్స్ చాలా వరకు తగ్గుతాయి అంటున్నారు ​నిపుణులు. కొన్ని ఫాలో అయితే.. కేవలం 15 రోజుల్లోనే బ్లడ్ షుగర్ లెవల్స్ చాలా వరకు తగ్గే అవకాశముందని అంటున్నారు.

డైట్​ మార్చుకోవాలి..

ముందుగా ఆహారం మార్చుకోవాలి. పిండి, చక్కెర ఉన్న ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. గ్లూటెన్ ఉన్న ఆహారాలు తినవద్దు. బదులుగా.. ఎక్కువ కూరగాయలు లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవచ్చు.

తేలకపాటి వ్యాయామాలు..

ఇప్పుడు చాలా మందికి పనిభారం పెరిగింది. దీనివల్ల కనీసం వ్యాయామం చేసే తీరిక కూడా ఉండట్లేదు. కానీ ప్రతిరోజూ కనీసం 40 నిమిషాల తేలికపాటి వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. మీరు వ్యాయామం చేయలేకపోతే.. కనీసం నడవండి. సైకిల్​ తొక్కండి. ప్రతిరోజూ 20 నిమిషాలు శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయండి.

భోజనం విషయంలో జాగ్రత్తలు..

రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోకండి. ఇది మధుమేహం స్థాయిని బాగా పెంచుతుంది. పడుకునే కనీసం 1 గంట ముందు రాత్రి భోజనం ముగించేయండి. రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం ఉత్తమం.

మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా దీనిని గుర్తుంచుకోవాలి. వీలైనంత త్వరగా తినండి. ఎందుకంటే తొందరగా ఆహారం తీసుకుంటే.. అది బాగా జీర్ణమవుతుంది. రాత్రి 8 గంటల లోపే తినేందుకు ప్రయత్నించండి.

కేవలం మధుమేహం మందులపైనే ఆధారపడవద్దు. మీ రక్తంలో చక్కెరను సాధారణ పద్ధతిలో వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి. మందుల మీద ఎక్కువగా ఆధారపడితే చివరికి ప్రయోజనం ఉండదు. మీరు వాటిని తీసుకోవడం ఆపివేసిన వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూనే ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం