Eggless Banana Cake Recipe : వీకెండ్ స్పెషల్ బనానా కేక్.. చేయడం చాలా ఈజీ..-easiest and tasty eggless banana cake here is recipe and making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eggless Banana Cake Recipe : వీకెండ్ స్పెషల్ బనానా కేక్.. చేయడం చాలా ఈజీ..

Eggless Banana Cake Recipe : వీకెండ్ స్పెషల్ బనానా కేక్.. చేయడం చాలా ఈజీ..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 03, 2022 08:00 AM IST

Banana Cake Recipe : మీరు అరటిపండ్లు బాగా తింటారా? అయితే మీరు అరటిపండుతో తయారు చేసే టేస్టీ టేస్టీ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. దీనిని తయారు చేయడం చాలా సులభం కూడా. ఇంతకీ ఆ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి ఆ రెసిపీనే బనానా కేక్.

స్పెషల్ బనానా కేక్
స్పెషల్ బనానా కేక్

Banana Cake Recipe : డిసెంబర్ వచ్చిందంటే చాలు కేక్​ల సీజన్ వచ్చినట్లే. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయంలో చాలా మంది కేక్​లనను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. అయితే ఓ సింపుల్​ రెసిపీతో.. మీ కేక్​ను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీకెండ్​కి ఇంట్లో ఈ కేక్ తయారు చేసుకుని.. క్రిస్మస్​ లేదా న్యూ ఇయర్​కి, లేదా మీ ఇంట్లోవారి బర్త్​డేలకు మీరే ఈజీగా ఈ కేక్ తయారు చేసేయవచ్చు. వారి అభిమానం పొందవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* వెన్ - 210 గ్రాములు

* బ్రౌన్ షుగర్ - 240 గ్రాములు

* అరటిపండ్లు - 150 గ్రాములు (పండినవి)

* పాలు - 200 గ్రాములు

* ఆల్ పర్పస్ ఫ్లోర్ - 300 గ్రాములు

* బాదం - 100 గ్రాములు

* గుడ్లు - 3

* బేకింగ్ పౌడర్ - 10 గ్రాములు

* దాల్చిన చెక్క పొడి - 2 గ్రాములు

తయారీ విధానం..

ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో.. గది ఉష్ణోగ్రత వద్ద.. వెన్నను, చక్కెరను మెత్తగా కలపండి. ఇప్పుడు అరటిపండును బాగా స్మాష్ చేసి.. పాలు కూడా వేసేయండి. అవి బాగా కలిసిన తర్వాత ఆల్ పర్పస్ పిండి, బేకింగ్ పౌడర్, దాల్చినచెక్క పొడి వేసి.. ఉండలు లేకుండా బాగా కలపండి. మీ కేక్ మిశ్రమం రెడీ అయిపోయింది. మీరు దీనిని ఓవెన్లో అయినా కుక్ చేయవచ్చు. లేదంటే కుక్కర్ ఉపయోగించి కూడా.. మీరు ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. కుక్ చేయడం పూర్తైన తర్వాత.. ఫ్రెష్ క్రీమ్​తో డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అలానే తినేయొచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అంతే.

Whats_app_banner

సంబంధిత కథనం