Bread Pakodi Chat Recipe : వీకెండ్​కి కొత్తగా బ్రెడ్ పకోడి చాట్​ని ట్రై చేయండి..-weekend special recipe bread pakodi chat here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Weekend Special Recipe Bread Pakodi Chat Here Is The Making Process

Bread Pakodi Chat Recipe : వీకెండ్​కి కొత్తగా బ్రెడ్ పకోడి చాట్​ని ట్రై చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 19, 2022 07:34 AM IST

Bread Pakodi Chat Recipe : ఇంట్లో బ్రెడ్ ఉంటే టోస్ట్ చేసుకుని తింటాము. లేదంటే పాలల్లో ముంచుకుని తింటాము. శాండ్​విచ్​ కూడా చేసుకోవచ్చు. కానీ.. బ్రెడ్​తో వేడి వేడి కరకరలాడే పకోడి చేసుకున్నారా ఎప్పుడైనా? ఆ పకోడితో చాట్ చేసుకున్నారా? బ్రెడ్​తో పకోడి ఏంటి.. చాట్ ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీ చూసేయ్యాల్సిందే.

బ్రెడ్ పకోడా చాట్
బ్రెడ్ పకోడా చాట్

Bread Pakodi Chat Recipe : వీకెండ్ ఉదయాన్ని కానీ.. చల్లని సాయంత్రాన్ని కానీ.. అదిరే ఫుడ్​తో కొనసాగించాలి అనుకుంటే బ్రెడ్ పకోడా చాట్​ని ట్రై చేయాల్సిందే. దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఈ వీకెండ్​కి కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే.. మీరు దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* బ్రెడ్ - 4

* బంగాళదుంపలు - 3

* పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి)

* ఉప్పు - రుచికి తగినంత

* పెప్పర్ - రుచికి తగినంత

* గరం మసాలా - అర టీ స్పూన్

* పుదీనా - 1 స్పూన్

* దానిమ్మ గింజలు - 2 టేబుల్ స్పూన్స్

* కారం - అర టీ స్పూన్

* శెనగపిండి - 1 కప్పు

* నూనె - డీప్ ఫ్రైకి సరిపడినంత

తయారీ విధానం

ఓ గిన్నె తీసుకుని దానిలో ఉడికించిన బంగాళ దుంపలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మసాలా వేసి బాగా కలపండి. రెండు బ్రెడ్ ముక్కలు తీసుకుని.. వాటిని ఆలు మిశ్రమంతో స్టఫ్ చేయండి. ఈ బాల్స్ పక్కన పెట్టి.. ఓ గిన్నె తీసుకోండి. దానిలో శెనగపిండి, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలపండి. పిండి పలుచగా కాకుండా చిక్కగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బ్రెడ్ బాల్స్​ను పిండిలో ముంచి.. వాటిని డీప్​ ఫ్రై చేయాలి. అవి వేగిన తర్వాత.. బయటకు తీసి నాలుగు సమాన భాగాలుగా కట్ చేయండి. వాటి మీద పెరుగు, పుదీనా చట్నీ వేయాలి. దాని పైన సేవ్, దానిమ్మ గింజలు, కొత్తిమీర ఆకులు వేసి.. గార్నిష్ చేయండి. ఈ బ్రెడ్ పకోడి చాట్ మిమ్మల్ని అస్సలు నిరుత్సాహపరచదు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్