Ducati | మోడ్రన్-క్లాసిక్ లుక్‌తో డుకాటి స్క్రాంబ్లర్ బైక్ లాంచ్, ధరెంతో తెలుసా?
మోడరన్-క్లాసిక్ బైక్‌లను ఇష్టపడే వారి కోసం డుకాటి తమ బ్రాండ్ నుంచి సరికొత్త లగ్జరీ మోటార్‌బైక్ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ PROను మార్చి 10న భారత మార్కెట్లో విడుదల చేసింది.
Chennai | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ డుకాటి .. సరికొత్త లగ్జరీ మోటార్‌బైక్ స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ PROను మార్చి 10న అంటే ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద కేవలం రూ. 12.89 లక్షలు మాత్రమే.
ఈ బైక్ విడుదల సందర్భంగా.. "సరికొత్త అధ్యాయానికి గుర్తుగా స్క్రాంబ్లర్ డుకాటి 1100 ట్రిబ్యూట్ ప్రో అనేది మోడరన్-క్లాసిక్ బైక్‌లను ఇష్టపడే వారి కోసం, మోటార్‌సైకిల్ చరిత్రలో డుకాటి సాధించిన ఎన్నో గొప్ప ఫీట్‌ల గురించి తెలిసిన అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించినన మోటార్‌సైకిల్" అని డుకాటీ ఇండియా పేర్కొంది.
ఈ బైక్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1972 నాటి ట్విన్-సిలిండర్ 450 డెస్మో మోనో, 750 స్పోర్ట్ మోటార్‌సైకిళ్లలో డుకాటి ఉపయోగించిన ప్రత్యేక మెటల్ బాడీ ఆకారాన్నే ఈ సరికొత్త 'స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రో'కు కల్పించారు. మోడ్రన్ వింటేజ్ లుక్ కోసం 1970ల నాటి తరహాలోనే డుకాటి లోగో, బ్లాక్ స్పోక్డ్ వీల్స్, బ్రౌన్ సీట్ ఈ బైక్‌లోనూ పొందుపరిచారు. ఈ నేపథ్యంలోనే ఈ బైక్ కు 'మూలాలను గుర్తుకుంచుకోండి' అని క్యాప్షన్ ఇచ్చారు.
Watch Here
ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. డుకాటి స్క్రాంబ్లర్ 1100 ట్రిబ్యూట్ ప్రోలో 1079 సిసి సామర్థ్యం గల ట్విన్-సిలిండర్ ఇంజన్ ఇచ్చారు. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పిని అలాగే 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 88 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంతటి పవర్ ఫుల్ ఇంజన్ ను స్లిప్పర్ క్లచ్‌తో ఆరు-గేర్లు కలిగిన స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేశారు.
అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ లతో పాటు యాక్టివ్, జర్నీ, సిటీ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీని ఇంధన ట్యాంక్ 15 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంది. దీని అంచున డ్యూయల్ సీటు ఇచ్చారు.
సంబంధిత కథనం