Tuesday Quote | ప్రతి ఒక్కరికి కల ఉండాలి.. దానిని సాధించేందుకు కృషి చేయాలి
కలాం గారు కలలు కనమన్నారు. వాటిని సాధించుకోవడం కోసం కృషి చేయమన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి సాధించాలనే కల ఉండాలి. ఆ కలను సాధించగలమనే నమ్మకముండాలి. దానిని సాధించేందుకు తగినంత కృషి చేయాలి.
Tuesday Motivation | కలలు కనడం అనేది మనుషుల లక్షణాలలో ఒకటి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది నిద్రలో వచ్చే కలలు గురించి ఏ మాత్రం కాదు. జీవితం గురించి కనాల్సిన కలల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ జీవితం గురించిన కలలు కూడా కనాలి. ఏదో ఒక రోజు జీవితంలో ఏదో సాధిస్తాం. గమ్యానికి చేరుకుంటామని తరచూ కలలు కంటూ.. దానికి తగినట్లు కృషి చేయాలి.
జీవితంలో దేని గురించైనా మీకు ఓ కల ఉంటే.. దానిని సాధించడానికి మీరు తప్పనిసరిగా కృషి చేయాలి. అంతేకాకుండా మీరు చేయవలసిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీపై మీకు నమ్మకం ఉండాలి. మీలోని ప్రేరణను మీరు కనుగొనగలిగితే.. మీరు కలలుగన్న లక్ష్యాన్ని చేరుకోకుండా ఎవరూ ఆపలేరు. మీ గురించి మీకు తగినంత నమ్మకం లేకపోతే.. మీరు కోరుకున్న గమ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మీ కలను ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నారో.. దానికి కచ్చితంగా ఓ ప్రణాళిక ఉండాలి. మీ కోరికను చేరుకోవడానికి ప్రణాళిక అవసరం. ఎందుకంటే ప్రణాళిక అనేది మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేస్తుంది.
సంబంధిత కథనం