Sexual Education | హస్తప్రయోగం తర్వాత అంగం శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుందో తెలుసా?
పైకి ఎన్ని రంగులు పూసినా, సెంట్లు కొట్టుకుని తిరిగినా.. చాలా మంది తమ ప్రైవేట్ భాగాలను మాత్రం పట్టించుకోరు. ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకోరు. కనీసం ఎందుకు హైజీన్గా ఉంచుకోవాలో అనే దానిపై కనీస అవగాహన ఉండదు. ఇలానే ఉంటే ప్రైవేట్ భాగాల్లో ఇన్ఫెక్షన్లు తప్పవంటున్నారు డాక్టర్ తనయ.
శరీరంలోని సున్నితమైన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్ తనయ. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, సెక్స్ గురించి ఉన్న మూఢనమ్మకాల గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించడంలో తనయ ఎప్పుడు ముందుంటారు. తాజాగా మగవారు అంగం శుభ్రం చేసుకోవాల్సిన అంశంపై పలు సూచనలు చేశారు. ప్రతి రోజు దానిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె వెల్లడించారు. సమస్యలు కొని తెచ్చుకున్నట్లే
లేకుంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని స్పష్టం చేశారు. తొడల ప్రాంతమనేది బ్యాక్టిరీయా వ్యాపించేందుకు అనువైన స్థలమని.. వేడి జనించే సున్నితమైన స్థలం కాబట్టి అక్కడ త్వరగా బ్యాక్టిరీయా వ్యాపించే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే ఈ ప్రాంతాలను శుభ్రం చేసుకోవాల్సిందే సూచించారు.
‘రోజూ అంగాన్ని వేడి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. లో దుస్తులు, జీన్స్, బయట తిరగడం వంటి కారణాలతో ఆ ప్రాంతంలో చెమట ఎక్కువగా పేరుకుంటుంది. ఆ సమయంలో బ్యాక్టిరీయా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే రోజూ వేడి నీళ్లతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్స్, వ్యాయామాలు, హస్తప్రయోగం చేసిన తర్వాత కచ్చితంగా అంగాన్ని శుభ్రం చేసుకోవాల్సిందే.
ఎలా శుభ్రపరచుకోవాలంటే?
వేడినీళ్లతో పాటు మైల్డ్ సబ్బుతో అంటే గాఢత తక్కువగా ఉండే సబ్బుతో దానిని శుభ్రపరుచుకోవాలి. దీనికోసం యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు కానీ, సువాసనలు వెదజల్లే సబ్బులు కానీ అవసరం లేదు. గాఢత తక్కువగా ఉండే సబ్బుతో రోజూ వేడినీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. అంగం చర్మాన్ని కొంచెం వెనక్కి లాగి (బలవంతంగా కాకుండా సున్నితంగా).. సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. మీరు సున్తీ చేయించుకోకుంటే మంచిగా ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఒకవేళ మీరు సున్తీ చేయించుకుంటే..?
ఒకవేళ మీరు సున్తీ చేయించుకుంటే సబ్బును నేరుగా కాకుండా.. చేతికి తీసుకుని దానితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముఖ్యంగా హస్తప్రయోగం చేసిన తర్వాత కచ్చితంగా అంగాన్ని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే హస్తప్రయోగం అనంతరం వచ్చే లిక్విడ్ డ్రై అయిపోతుంది. దాని వల్ల ఆ ప్రాంతంలోని చర్మం పొడిబారి స్కిన్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి.
అసలు ఎందుకు శుభ్రం చేసుకోవాలి..
శుభ్రం చేసుకోకపోతే.. ఆ ప్రాంతంలో ఫామ్ ఆయిల్, మురికి అంతా కలిసిపోయి స్మెగ్మాగా ఏర్పడతాయి. దీనిని డిక్ చీజ్ అని కూడా అంటారు. పరిశుభ్రం చేసుకోకపోవడం వల్ల స్మెగ్మా కలిసి ఆ ప్రాంతంలో మంట ఏర్పడుతుంది. ఇది అంగంపై ఉన్న చర్మాన్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా తీవ్ర మంటను కలిగిస్తుంది.
వృషణాలను మరిచిపోవద్దు..
వృషణాలను సైతం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆ ప్రాంతంలో పెరిగే వెంట్రుకలు, చెమట కలిసి.. దుర్గంధం, చిరాకు, ఇన్ ఫెక్షన్లు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.''
కాబట్టి అంగం, వృషణాలు, వాటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని.. ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలని డాక్టర్ తనయ సూచించారు.
సంబంధిత కథనం