డీహైడ్రేషన్ కారణంగా శృంగార జీవితంపై ఎఫెక్ట్.. తీవ్రమైన నొప్పి
మనం చేసే చాలా పనులు శృంగార జీవితంపై ప్రభావం చూపిస్తాయి. అందుకే ప్రతీ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. డీహైడ్రెషన్ కూడా శృంగార జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా?
వాతావరణంలో మార్పుతో శరీర నీటి అవసరాలు కూడా మారుతాయి. ఈ విషయంపై మెుత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. డీహైడ్రేషన్ మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హైడ్రేషన్ లోపించడం వల్ల స్త్రీపురుషులు ఇద్దరిలో కూడా అలసట, చికాకు, మూడ్ లేకపోవడం, అంగస్తంభన లోపం, యోని పొడిబారడం వంటి అనేక మార్పులు సంభవిస్తాయి.
డీహైడ్రెషన్ మహిళలకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే నిర్జలీకరణం యోనిలో పొడిని కలిగిస్తుంది. ఇది శృంగారం సమయంలో నొప్పిని తెప్పిస్తుంది. ఈ సమయంలో మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. శారీరక సంబంధాల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు. అదే సమయంలో శృంగార సమయంలో నొప్పి మిమ్మల్ని మరింత బాధపెడుతుంది. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించాలి.
పుచ్చకాయ, నారింజ, సీతాఫలం, పైనాపిల్ మొదలైన వాటి వరకు, అధిక మొత్తంలో నీటిని కలిగి ఉన్న అనేక పండ్లు ఉన్నాయి. ఇది కాకుండా, మీరు బ్రోకోలీ, దోసకాయ వంటి వాటిని తీసుకోవడం ద్వారా కూడా శరీరంలో నీటి స్థాయిని పెంచుకోవచ్చు.
సూప్‌లు తాగడానికి రుచికరమైనవి మాత్రమే కాదు.. వాటి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు కాలానుగుణ కూరగాయలు, మూలికల సహాయంతో వివిధ రకాల సూప్‌లను తయారు చేసుకోవచ్చు. మీ శరీరంలో నీటి కొరతను అధిగమించవచ్చు.
కొందరు దాహం వేసిన కూడా నీళ్లు తాగరు. మరికొందరు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. కానీ దాహం అనిపించడం మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురైందనడానికి సంకేతం. సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో నిర్జలీకరణ స్థాయి అధిక స్థాయికి చేరుకున్నప్పుడు దాహం వేస్తుంది. అందువల్ల, దాహం అనిపించకపోయినా అప్పుడప్పుడు నీరు తాగడానికి ప్రయత్నించండి.
కొంతమంది పని చేస్తున్నప్పుడు నీళ్లు తాగడం మరిచిపోతుంటారు. అటువంటి పరిస్థితిలో నీరు తాగడానికి రిమైండర్ సెట్ చేయండి. ఇది మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. లేదంటే చాలా సమస్యలు వస్తాయి.
మీరు శరీర తరచుగా హైడ్రేషన్‍కు గురవుతుంటే.. మీరు మద్యపానానికి దూరంగా ఉండండి. ఇది మీకు తెలియకపోవచ్చు, కానీ మద్యం సేవించడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ మద్యం తాగితే.. అంగస్తంభన సమస్యలు కూడా రావొచ్చు.