Veg soup: జ్వరం వస్తే ఈ వెజ్ సూప్ తాగండి, నోటికి రుచిస్తుంది, పోషకాలూ అందుతాయి-cooking process and ingredients for making vegetable soup ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Veg Soup: జ్వరం వస్తే ఈ వెజ్ సూప్ తాగండి, నోటికి రుచిస్తుంది, పోషకాలూ అందుతాయి

Veg soup: జ్వరం వస్తే ఈ వెజ్ సూప్ తాగండి, నోటికి రుచిస్తుంది, పోషకాలూ అందుతాయి

Koutik Pranaya Sree HT Telugu
Sep 26, 2024 03:30 PM IST

Veg soup: మీరు వెజిటబుల్ సూప్ ను డైట్ లో చేర్చాలనుకుంటే, ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి. కూరగాయల సూబ్ తయారు చేయడానికి సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

వెజిటేబుల్ సూప్
వెజిటేబుల్ సూప్

జ్వరం వల్ల, అనారోగ్యం వల్ల నోటికి ఏం తిన్నా రుచించకపోతే ఈ వెజ్ సూప్ తాగి చూడండి. కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. కడుపు కూడా నిండిపోతుంది. నోటికి రుచిగానూ ఉంటుంది. అలాగే బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు కూడా దీన్ని డైట్‌లో భాగం చేసుకోవచ్చు. కూరగాయ ముక్కల్లో ఉండే పీచు వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంటుంది. ఆకలి వేయదు. ఈ సూప్ తయారీ చూసేయండి.

వెజిటబుల్ సూప్ తయారీకి కావాల్సినవి:

3 వెల్లుల్లి రెబ్బలు, 

చెంచాడు నూనె

అంగుళం అల్లం ముక్క

1 ఉల్లిపాయ

2 క్యారెట్లు

పావు కప్పు బీన్స్ 

1 క్యాప్సికం

2 చెంచాల క్యాబేజీ ముక్కలు

2 చెంచాల బఠానీలు

అరచెంచా ఉప్పు 

అరచెంచా మిక్స్డ్ హెర్బ్స్

పావు చెంచా మిరియాల పొడి

చెంచాడు కార్న్ ఫ్లోర్

2 చెంచాల ఉల్లికాడల తరుగు

వెజిటబుల్ సూప్ తయారీ విధానం:

  1. ముందుగా కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడిగి సన్నటి ముక్కల్లా తరిగి పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు వేయించాలి. 
  3. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసి ఒక నిమిషం వేయించి కలపాలి. ఇప్పుడు క్యాబేజీ, బఠానీలు, స్వీట్ కార్న్ కూడా వేసి మరికాస్త వేయించాలి. 
  4. తర్వాత అందులో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడుమూతపెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి. కూరగాయలన్నీ మెత్తబడతాయి.. 
  5. సూప్ లో కూరగాయలు క్రంచీగా ఉండాలి. ఎక్కువగా ఉడికించిన కూరగాయలు రుచిగా ఉండవని గుర్తుంచుకోండి.
  6. ఈలోపు కార్న్ ఫ్లోర్‌ను పావు కప్పు నీళ్లలో వేసి కలపండి. కూరగాయలు ఉడికిన తర్వాత సూప్ లో వేసి చిక్కబడే వరకు మరిగించాలి. 
  7. ఇప్పుడు నిమ్మరసం, మిక్స్డ్ హెర్బ్స్, మిరియాల పొడి వేసి కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేసి, చివరగా ఉల్లి కాడల తరుగు వేసి సూప్ ను ఆస్వాదించండి. 
  8. ఈ సూప్ లో మీకు ఇష్టమైన కూరగాయలను చేర్చుకోవచ్చు. మీకు నచ్చని వాటిని కూడా వేయకుండా చేసుకోవచ్చు..

Whats_app_banner