శరీరంలో తగినంత రోగ నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. లేకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Unsplash
By Anand Sai Sep 09, 2024
Hindustan Times Telugu
ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా సహజ సిద్దంగా మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
Unsplash
రోగ నిరోధక శక్తిని పెంచే కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
Unsplash
ఒక గిన్నెలో గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఒక అల్లం ముక్కును దంచి వేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క, అర టీ స్పూన్ పసుపు, 5 లేదా 6 తులసి ఆకులు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి.
Unsplash
ఈ నీటిని చిన్న మంటపై అర గ్లాస్ కషాయం అయ్యే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఒక గ్లాస్ లోకి వడకట్టుకుని తీసుకోవాలి.
Unsplash
ఈ కషాయంలో తేనెను కూడా వేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ 3 నుండి 4 టేబుల్ స్పూన్ల మోతాదులో పరగడుపున తీసుకోవాలి.
Unsplash
పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో ఇవ్వాలి.
Unsplash
ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Unsplash
వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న సుప్రీత.. హాట్ ఫొటోలతో ఫైర్