Constipation Diet Plan : ఈ డైట్‌తో మలబద్ధకాన్ని దూరం చేసుకోండి..
Constipation Diet Plan : మలబద్ధకం అనేది చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో ఒకటి. ఈ సమస్య చాలా తీవ్రతరమైన ఇబ్బందులను కలిగిస్తుంది. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలనుకుంటే.. ఆహారంలో పలు మార్పులు చేయాలంటున్నారు డైటీషన్లు.
Constipation Diet Plan : మలబద్ధకం సమస్యను తేలికగా తీసుకోకూడదంటున్నారు డైటీషియన్ మన్‌ప్రీత్ కల్రా. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి సరైన డైట్ ప్లాన్ అవసరం అవసరం అంటున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడితే కచ్చితంగా వైద్యుని సంప్రదించాలి అంటున్నారు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని ఫాలో అవ్వడం, వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా నయమవుతుంది అంటున్నారు. అయితే మన్‌ప్రీత్ ఎలాంటి డైట్ తీసుకోవాలో సూచిస్తున్నారు. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడితే ఈ డైట్‌ను ఫాలో అవ్వండి.
ఉదయం నిద్రలేచిన వెంటనే..
రాత్రి పడుకునే ముందు ఒక కప్పు నీటిలో ఒక చెంచా తులసి గింజలను నానబెట్టండి. ఉదయమే దానిని తాగండి. ఇవే కాకుండా 5 బాదంపప్పులు, 1 వాల్‌నట్, 3 నల్ల ఎండుద్రాక్ష (రాత్రిపూట నానబెట్టి) ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు తీసుకోండి.
అల్పాహారం కోసం ఏమి తీసుకోవాలి..
అల్పాహారం కోసం ఖర్జూరం, ఓట్స్, దాల్చిన చెక్క, చియా గింజలతో కూడిన ఒక కప్పు పాలు తీసుకోండి. దీంతో పొట్ట క్లియర్ అవుతుంది. బొప్పాయిని తప్పకుండా డైట్లో చేర్చుకోండి. పండిన బొప్పాయి తింటే పొట్ట శుభ్రపడుతుంది.
మధ్యాహ్న భోజనంలో ఏమి తినాలి..
భోజనానికి 30 నిమిషాల ముందు బటర్ మిల్క్ తాగండి. మధ్యాహ్న భోజనంంలో రొట్టెలు తీసుకోండి. దానితో పాటు ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు. మధ్యాహ్న మీల్లో ఎక్కువ ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.
సాయంత్రం సంగతేంటి?
సాయంత్రం 5 గంటల వరకు కొంచెం పెరుగుతో కీరదోసకాయ, క్యారెట్, దుంపలు తినండి. పెరుగులో కొన్ని కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి తీసుకోండి.
రాత్రి డైట్
డిన్నర్ చాలా త్వరగా ముగించేయండి. కూరగాయలు ఎక్కువగా తినండి. ఆ తర్వాత పాలలో కాస్త మిరియాలు, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపి తాగేయాలి.
సంబంధిత కథనం
టాపిక్