Skin cancer: స్కిన్ క్యాన్సర్ వీటివల్ల వస్తుందంటే నమ్మలేరు.. వీటిని వాడటం ఆపేయాల్సిందే..-common skin allergens and their potential link to skin cancer risk ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Cancer: స్కిన్ క్యాన్సర్ వీటివల్ల వస్తుందంటే నమ్మలేరు.. వీటిని వాడటం ఆపేయాల్సిందే..

Skin cancer: స్కిన్ క్యాన్సర్ వీటివల్ల వస్తుందంటే నమ్మలేరు.. వీటిని వాడటం ఆపేయాల్సిందే..

Koutik Pranaya Sree HT Telugu
Jun 30, 2024 12:20 PM IST

Skin cancer: నికెల్ జ్యువెలరీ నుంచి ప్రిజర్వేటివ్స్ ఉన్న కాస్మోటిక్స్ దాకా స్కిన్ క్యాన్సర్‌ ప్రమాదం పెంచే కారకాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెల్సుకోండి..

స్కిన్ క్యాన్సర్ కారకాలు
స్కిన్ క్యాన్సర్ కారకాలు (Unsplash)

కొన్ని రకాల చర్మ సంబంధిత ఎలర్జీలు, ర్యాషెస్ వల్ల దీర్ఘకాళికంగా వేదించే ఇన్ఫ్లమేషన్‌ సమస్య వస్తుంది. ఇది క్రమంగా చర్మ క్యాన్సర్ లేదా స్కిన్ క్యాన్సర్‌కు దారితీయవచ్చని డాక్టర్ షిఫా యాదవ్ అన్నారు.

చర్మ క్యాన్సర్‌కు దారితీసే కొన్ని ఎలర్జీ కారకాల జాబితాను రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి వివరించారు. అవేంటో చూడండి.

నికెల్:

నగలు, నాణాలు, కొన్ని రకాల గృహోపకరణ వస్తువుల్లో నికెల్ ఉంటుంది. నిరంతరం నికెల్ తాకుతూ ఉండటం వల్ల కాంటాక్ట్ డెర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘాకాలికంగా ఇన్ఫ్లమేషన్‌ సమస్య ఉంటుంది. దానివల్ల చర్మ కణాలు, డీఎన్‌ఏ దెబ్బ తింటాయి. ఇవన్నీ చర్మ క్యాన్సర్‌కు దారి తీస్తాయి.

సుగంధ ద్రవ్యాలు:

పర్ఫ్యూమ్, లోషన్లు, సబ్బులు లాంటి సువాసననిచ్చే కాస్మోటిక్స్‌ వల్ల కొందరిలో ఎలర్జిక్ రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఈ ఎలర్జీ కలిగించే కారకాలు తాకడం వల్ల డెర్మటైటిస్, స్కిన్ ర్యాషెస్ రావచ్చు. క్రమంగా స్కిన్ క్యాన్సర్‌కు కారణం కావచ్చు.

ప్రిజర్వేటివ్స్:

పారాబెన్లు, ఫార్మాల్డిహైడ్ లాంటి ప్రిజర్వేటివ్స్ కాస్మోటిక్స్, స్కిన్ కేర్ ఉత్పత్తుల్లో ఉంటాయి. వీటివల్ల కూడా చర్మానికి ఇన్ఫ్లమేషన్‌ రావచ్చు. క్యాన్సర్ ప్రమాదం పెంచొచ్చు.

కెమికల్ సన్‌స్క్రీన్స్:

సన్‌స్క్రీన్ లో ఆక్సిబెంజోన్, అవో బెంజోన్ లాంటి రసాయనాలుంటాయి. ఇవి యూవీ కిరణాల నుంచి కాపాడతాయి. కానీ కొందరిలో వీటివల్ల ఎలర్జీలు రావచ్చు. వీటివల్ల దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వచ్చి స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

హెయిర్ డై:

పారా ఫెనిలెన్డైమైన్ (పీపీడీ) జుట్టుకు వేసుకునే కొన్ని రకాల హెయిర్ డైలలో ఉంటుంది. ఇవి ఎక్కువగా వాడినప్పుడు కూడా చర్మం ఇన్ఫ్లమేషన్‌కు గురవుతుంది. దానివల్ల కూడా క్యాన్సర్ రావచ్చు.

ఎగ్జీమా:

అటోపిక్ డెర్మటైటిస్ వ్యాధిలో ఇన్ఫ్లమేషన్, దురద, ఎరుపు రంగు మచ్చలు చర్మం మీద కనిపిస్తాయి. ఈ ఎగ్జీమా వల్ల వచ్చే దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ వల్ల చర్మ కణాల్లో ఉండే డీఎన్ఏ దెబ్బతింటుంది. ఇది చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఫోటో సెన్సిటివిటీ:

ఫోటోసెన్సిటివిటీ, లేదా అతినీలలోహిత (యువి) కాంతితో పెరిగిన సున్నితత్వం, కొన్ని మందులు, వైద్య పరిస్థితులు లేదా నిర్దిష్ట రసాయనాలకు గురికావడం వల్ల సంభవించవచ్చు. ఫోటోసెన్సిటివిటీ ఉన్నవారిలో యూవీ కిరణాలు పడగానే తీవ్రమైన చర్మ రియాక్షన్ వస్తుంది. ఇది దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్, చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.

కాబట్టి చర్మ సంరక్షణ కోసం, అందం కోసం.. చర్మం కోసం ఎలాంటి ఉత్పత్తి వాడినా వాటిలో ఉండే పదార్థాల గురించి పూర్తిగా తెల్సుకోవాలి. సరైన అవగాహన లేక వాడితే దీర్ఘకాలికంగా పెద్ద సమస్యను కొని తెచ్చుకుంటున్నట్లే. కాబట్టి వీలైనంత ఎక్కువగా సహజ పద్ధతుల్లో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. లేదంటే పూర్తిగా తెల్సుకున్నాకే ఏ ఉత్పత్తి అయినా వాడటం మొదలు పెట్టండి.

Whats_app_banner