cold coffee: రెండే రెండు నిమిషాల్లో కోల్డ్ కాఫీ సిద్దం-cold coffee a perfect beverage in summer season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cold Coffee: రెండే రెండు నిమిషాల్లో కోల్డ్ కాఫీ సిద్దం

cold coffee: రెండే రెండు నిమిషాల్లో కోల్డ్ కాఫీ సిద్దం

Koutik Pranaya Sree HT Telugu
Apr 26, 2023 05:00 PM IST

కోల్డ్‌ కాఫీని బయట కెఫేలలో ఎక్కువగా తాగుతుంటాం. కానీ అచ్చం అదే రుచితో ఇంట్లోనే సులువుగా దాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో సాయంత్రం పూట చల్లటి కాఫీ మంచి పానీయం అవుతుంది.

కోల్డ్ కాఫీ
కోల్డ్ కాఫీ

కాఫీ ప్రియులకు ఎండాకాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా కాఫీ తాగాలంటే కష్టమే. దానికి బదులుగా చల్లగా ఉండే కోల్డ్ కాఫీ తాగి చూడండి. సులువుగా తయారు చేసుకోవచ్చు కూడా.

కావాల్సిన పదార్థాలు:

కాఫీ పొడి- 1 టేబుల్ స్పూన్

గోరువెచ్చని నీళ్లు - పావు కప్పు

పంచదార - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు

పాలు - రెండు కప్పులు (చల్లనివి)

ఐస్ క్యూబులు - 5 లేదా 6

తయారీ విధానం:

step 1: మిక్సీజార్ లో , కాఫీ పొడి, పంచదార, గోరువెచ్చని నీళ్లు పోసుకోవాలి. ఒక నిమిషం పాటూ దాన్ని మిక్సీ పట్టండి. చూడటానికి నురుగులాగా వచ్చి కాఫీ లేత రంగులోకి మారాలి.

step 2 : ఇందులో ఐదారు ఐస్‌క్యూబ్‌లు వేయండి. ఒకవేళ కాఫీ చిక్కగా కావాలనుకుంటే రెండు లేదా మూడు ఐస్‌క్యూబ్‌లు మాత్రమే వేసుకోండి.

step 3 : అదే జార్ లో రెండు కప్పుల నీళ్లు కూడా పోసేయండి. చిక్కటి పాలుంటే కాఫీ క్రీమీగా ఉంటుంది. లేదంటే బజారులో తక్కువ కొవ్వు శాతం ఉండే పాలు దొరుకుతాయి. అవి వాడొచ్చు. లేదంటే చిక్కటి పాలనే కప్పుకి బదులు మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది.

step 4 : పాలుపోశాక ఒక నిమిషం పాటూ మళ్లీ మిక్సీ పట్టాలి. పాలు చక్కగా కలిసిపోయి పైన నురుగుతో పొర తయారవుతుంది. ఇంకేం దీన్ని గ్లాసులో పోసి సర్వ్ చేయడమే.

 

Whats_app_banner