Anant-Radhika Love Story: మూడు ముళ్ల బంధంతో ఏకమైన చిన్ననాటి ప్రేమికులు, వీరి ప్రేమ కథ చాలా స్వీట్-childhood lovers united in marriage their love story is very sweet ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anant-radhika Love Story: మూడు ముళ్ల బంధంతో ఏకమైన చిన్ననాటి ప్రేమికులు, వీరి ప్రేమ కథ చాలా స్వీట్

Anant-Radhika Love Story: మూడు ముళ్ల బంధంతో ఏకమైన చిన్ననాటి ప్రేమికులు, వీరి ప్రేమ కథ చాలా స్వీట్

Haritha Chappa HT Telugu
Jul 13, 2024 10:30 AM IST

Anant-Radhika Love Story: చిన్ననాటి ప్రేమికులు రాధికా మర్చంట్, అనంత్ అంబానీలు పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి స్నేహం చిన్నప్పుడే మొదలైంది. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది.

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ లవ్ స్టోరీ
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ లవ్ స్టోరీ (instagram)

ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అతి ఖరీదైన వెడ్డింగ్ అనంత్ అంబానీ - రాధికా మర్చంట్‌లది. రాధిక, అనంత్ జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని ప్రమాణం చేసి వివాహ బంధంలో అడుగుపెట్టారు. జూలై 12 శుక్రవారం రాత్రి 8 గంటలకు వీరి పెళ్లి వైభవంగా జరిగింది. వీరి ప్రేమ, పెళ్లి రెండూ సోషల్ మీడియాలో ఎంతో చర్చనీయాంశమైన అంశాలే. చాలా మంది సోషల్ మీడియాలో వీరి జోడీని ట్రోల్ చేశారు. మెరుపుతీగలాంటి రాధికా… తిరుపతి లడ్డూలా ఉన్న అనంత్ అంబానీని ఎలా ప్రేమించిందంటూ కామెంట్లు చేశారు. కానీ వీరిద్దరూ అలాంటి ట్రోలింగ్‌ను పట్టించుకోలేదు. తన ప్రేమలోని నిజాయితీలో పెళ్లి వరకు చేరారు.

yearly horoscope entry point

నిజానికి రాధిక, అనంత్ ల ఈ ప్రేమకథ ఈనాటిది కాదు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. స్కూల్లో మొదలైన వీరి స్నేహం వారితో పాటూ పెరిగి ప్రేమగా మారింది. పెళ్లితో వారు పరిపూర్ణ జంటగా మారారు. వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. 2018లో తొలిసారి వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరూ ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ కనిపించారు. దీంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. ఇక అప్పట్నించి ముఖేష్ అంబానీ కుటుంబంలో ఏ వేడుక జరిగినా అక్కడ రాధికా కనిపించడం మొదలైంది. చివరికి వారి నిశ్చితార్ధంతో వారి ప్రేమ ప్రపంచానికి తెలిపింది.

ఒకరికొకరు అండగా…

అనంత్ ఆరోగ్యం గురించి రాధికకు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది. అనంత్ తన ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి రాధిక అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా అనంత్ ను వదల్లేదు. అనంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ రాధిక మాత్రం వాటిని పట్టించుకోకుండా, అతనికి ధైర్యాన్నిచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడల్లా ఇద్దరి కళ్లలో ఆనందం, ఒకరిపై ఒకరికి అపారమైన ప్రేమ కనిపిస్తుంది.

తనకు జంతువులంటే చాలా ఇష్టమని అనంత్ తరచూ ఇంటర్వ్యూలలో చెబుతుంటాడు. జంతు సంక్షేమం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. జంతువులకు సేవ చేయడానికి సమయం దొరకకపోవడంతో తాను పెళ్లి చేసుకోవాలనుకోలేదని అనంత్ చెప్పాడు. అయితే రాధికతో ప్రేమలో పడిన తరువాత, ఆమెతో ప్రయాణం మొదలు పెట్టాక తన అభిప్రాయాన్నే మార్చుకున్నాడు. రాధిక మర్చంట్ … అనంత్ ఇష్టాలనే తన ఇష్టంగా మార్చుకుంది. వారిద్దరూ కలిసి జంతు సంక్షేమం కోసం ఎంతో కష్టపడుతున్నారు.

అపారమైన ప్రేమ

రాధిక, అనంత్ తమ వివాహ సమయంలో ఎప్పుడు సందర్భం దొరికినా ఒకరిపై ఒకరికి ఉన్న అపారమైన గౌరవాన్ని వ్యక్తపరిచేవారు. రాధికా లాంటి భాగస్వామి దొరకడం తన అదృష్టమని అనంత్ చెబుతూనే ఉండేవాడు. రిలేషన్ షిప్‌లో గౌరవభావం లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా ఆ బంధం ఎప్పటికీ దృఢంగా ఉండదు. అనంత్, రాధికలను చూసి నిజమైన ప్రేమంటే ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నా ఫర్వాలేదు కానీ ఈ ప్రేమ పెళ్లిగా మారితే రెండు కుటుంబాలు కనెక్ట్ అవుతాయి. ప్రతి వ్యక్తి తన భాగస్వామి… తన కుటుంబాన్ని కూడా గౌరవించాలని, ప్రేమించాలని కోరుకుంటాడు. రాధిక, అనంత్ ల రిలేషన్ షిప్ చాలా ప్రత్యేకం కావడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. వారిద్దరికీ ఒకరి కుటుంబం పట్ల మరొకరికి చాలా గౌరవం ఉంది. ప్రీ వెడ్డింగ్ ఫెస్టివల్స్ సందర్భంగా వీరిద్దరూ ఒకరి కుటుంబం కోసం మరొకరు తమ మనసులోని ప్రేమను, గౌరవాన్ని బయటపెట్టారు

Whats_app_banner