Chikki in winter: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన చిరుతిండి చిక్కీ, ఎందుకంటే...
Chikki in winter: శీతాకాలం వచ్చిందంటే ప్రత్యేకమైన ఆహారాలను తినాలి. అందులో ఒకటి చిక్కీ.
Chikki in winter: చిక్కీలు అందరికీ తెలిసిన చిరుతిండే. దీన్ని కొంతమంది గజక్ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా బెల్లం, వేరుశనగ పలుకులతో తయారు చేస్తారు. కొన్నిసార్లు నువ్వులు కూడా కలిపి చేస్తారు. చల్లని కాలంలో ఈ చిక్కీలను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరం మరీ చల్లబడిపోవడం వంటి సమస్య రాదు. చిక్కీలలో ఎన్నో అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చర్మ పోషణకు ఇందులో ఉన్న న్యూట్రియెంట్లు పనిచేస్తాయి. చిక్కీలలో ప్రధాన పదార్థం బెల్లం. ఈ బెల్లాన్ని తినడం వల్ల శరీరానికి ఇనుము అందుతుంది. తద్వారా రక్తం ఉత్పత్తి జరుగుతుంది. శక్తి స్థాయిలు కూడా పడిపోకుండా ఉంటాయి. కాబట్టి శీతాకాలపు సంబంధిత వ్యాధులను తట్టుకోవాలంటే ప్రతిరోజూ చిక్కీలను తినడం అలవాటు చేసుకోవాలి.
చలికాలం చిరుతిండి
చలికాలంలో తీపి పదార్థం తినాలనిపించినప్పుడు పంచదారతో చేసిన స్వీట్లు తినే బదులు ఈ చిక్కీలను తినేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే బెల్లం ఎముకలకు కాల్షియన్ని అందిస్తుంది. ఎముకలు గట్టిగా ఉండేలా చేస్తుంది. నువ్వులను కూడా కలిపితే ఎముకలు మరింత దృఢత్వాన్ని పొందుతాయి. అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఎనీమియా అంటే రక్తహీనత సమస్యతో బాధపడేవారు. వీరు ప్రతిరోజూ చిక్కీ తినాల్సిన అవసరం ఉంది. ఇది ఐరన్ స్థాయిలను పెంచి రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది.
బెల్లం, నువ్వులు, వేరుశెనగ పలుకులు... ఈ మూడు కూడా శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన పదార్థాలు. నువ్వుల్లో మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి త్వరగా అలసిపోకుండా అడ్డుకుంటాయి. శక్తి స్థాయిలను పెంచడానికి సహకరిస్తాయి. బెల్లం సహజంగానే స్వీట్ గా ఉంటుంది. ఇది వెంటనే శక్తిని అందిస్తుంది. ఫైబర్ జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బెల్లం పేగు కదలికలను సులభతరం చేసి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థ బావుండాలంటే ప్రతిరోజు చిక్కీని తినాలి. మధుమేహం ఉన్నవారు కూడా చిక్కీని తినవచ్చు. కాకపోతే మితంగా తినడం మంచిది. ప్రతిరోజు తినడం అలవాటు చేసుకుంటే మంచిది.
టాపిక్