Women's Health | పీరియడ్స్​లో భయంకరమైన నొప్పా.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..-check out these 5 ways to deal with pms and period pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Health | పీరియడ్స్​లో భయంకరమైన నొప్పా.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

Women's Health | పీరియడ్స్​లో భయంకరమైన నొప్పా.. ఈ చిట్కాలు ఫాలో అయిపోండి..

HT Telugu Desk HT Telugu
May 31, 2022 12:15 PM IST

కడుపు తిమ్మిరి, భయంకరమైన మూడ్ స్వింగ్‌లు, కడుపు ఉబ్బరం, వెన్నునొప్పి, రొమ్ములో ఇబ్బంది మొదలైనవన్ని పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు. కొందరు అదృష్టవంతులకు ఈ లక్షణాలు తేలికగా ఉంటాయి. కానీ మరికొందరికి చాలా తీవ్రమైన లక్షణాలు ఉండొచ్చు. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పిని ఎదుర్కోవటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీరు కూడా ఈ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే.. ఫాలో అయిపోండి.

<p>పీరియడ్ సమయంలో నొప్పులా?</p>
పీరియడ్ సమయంలో నొప్పులా?

Painful periods | పీరియడ్స్ అనేది ప్రతి స్త్రీ అనుభవించాల్సిన ఓ ప్రక్రియ. ఆ సమయంలో వచ్చే నొప్పి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. కడుపు తిమ్మిరి, భయంకరమైన మూడ్ స్వింగ్స్, కడుపు ఉబ్బరం.. ఇలా ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతూ ఎన్నో సమస్యలు ఉంటాయి. సరిగ్గా కూర్చోలేరు.. పడుకోలేరు.. ఎక్కువ సేపు నుంచో లేరు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలనుంచి కాస్త ఉపశమనానికి.. పెయిన్ రిలీఫ్ క్యాప్సూల్స్ ఉన్నప్పటికీ.. అవి ఎక్కువ సేపు పనిచేయవు. ఉబ్బరం, కడుపు తిమ్మిరి, హార్మోన్ల వల్ల కలిగే మొటిమలు, మూడ్ స్వింగ్‌లు, చిరాకు వంటి వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుని మీరు కూడా ఫాలో అయిపోండి.

చిట్కా - 1

గోరువెచ్చని నీటి సంచులు లేదా హీట్ ప్యాడ్‌లు ఉదర కండరాలను సడలించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. తద్వారా మీకు అవసరమైన ఉపశమనాన్ని అందిస్తాయి. తిమ్మిరి నుంచి ఉపశమనం పొందడంలో కచ్చితంగా సహాయపడతాయి.

చిట్కా - 2

నీరు చాలా సమస్యలకు మంచి పరిష్కారం. నీరు ఎక్కువగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం అదుపులో ఉంటుంది. అంతేకాకుండా తిమ్మిరిని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది.

చిట్కా - 3

మంట, కడుపు ఉబ్బరం పెరగడం ద్వారా తిమ్మిర్లు, కండరాల నొప్పులను మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి కారణం చక్కెరతో చేసిన వంటకాలే. అందుకే పీరియడ్స్ సమయంలో వాటిని దూరం పెట్టండి.

చిట్కా - 4

తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయండి. పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయాలని ఉండకపోవచ్చు కానీ.. ఇలా చేయడం వల్ల ఎండార్ఫిన్‌లు అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇది మీ కండరాలకు విశ్రాంతినిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.

చిట్కా - 5

ఒత్తిడిని తగ్గించుకోండి. లోతైన శ్వాస లేదా ధ్యానం చేయండి. లేదా ఒత్తిడిని తగ్గించే మీ గో-టు కార్యకలాపాల్లో పాల్గొనండి. దీని వల్ల మూఢ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం