Tooth Brush : మీరు అనారోగ్యం నుంచి కోలుకున్నాక.. టూత్‌బ్రష్ మార్చాల్సిందే
Tooth Brush Change : మీరు అనారోగ్యంతో ఉంటే, కోలుకున్న తర్వాత మీరు మొదట మీ బెడ్ షీట్స్ మారుస్తారు. కొంతమంది ఇంటిని కూడా శుభ్రం చేస్తారు. అయితే మీరు మెుదటగా చేయాల్సిందేంటో తెలుసా? మీ టూత్‌బ్రష్‌ను కూడా మార్చుకోవాలి.
మీకు ఏదైనా అనారోగ్య సమస్య(Health Problem) వస్తుంది. ఆ సమయంలో అంతకుముందు ఉపయోగించిన టూత్ బ్రష్(Tooth Brush)ను ఉపయోగిస్తారు. కోలుకున్నాక కూడా అదే వాడుతారు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు వాడిన బ్రష్ ను తర్వాత కూడా ఉపయోగించకూడదు. దీనివలన సమస్యలు వస్తాయి.
మీరు ఏదైనా రోగం నుంచి కోలుకున్న తర్వాత.. మొదట మీ బెడ్‌క్లాత్(Bed Cloth)లను మార్చుకుంటారు. టూత్‌బ్రష్‌ను కూడా మార్చుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మీరు కోలుకున్న తర్వాత మంచం, దిండు, ఇతర వస్తువులను శుభ్రం చేయాలి. ఇన్ఫెక్షన్(Infection)ను దృష్టిలో ఉంచుకుని ఈ పని చేయాలి. అనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత, మీకు మళ్లీ వైరల్ ఇన్ఫెక్షన్(Viral Infection) రాకుండా నిరోధించడానికి టూత్ బ్రష్‌ను మార్చాలి.
అంటు వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజలు వైరల్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు, ఇతర బ్యాక్టీరియా ద్వారా కూడా ప్రభావితమవుతున్నారు. అనారోగ్యం సమయంలో రోగి పళ్లు తోముకోవడం వల్ల వారి నోటిలోని ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా టూత్ బ్రష్‌కు అంటుకుంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని తర్వాత, రోగి కోలుకున్న తర్వాత కూడా అదే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తే, ఆ టూత్ బ్రష్ ద్వారా ఇన్ఫెక్షియస్ బ్యాక్టీరియా మళ్లీ దాడి చేస్తుంది.
వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత టూత్ బ్రష్ మార్చండి. ఫంగల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న తర్వాత టూత్ బ్రష్ మార్చడం చాలా ముఖ్యం. అంటే, ఇంట్లో ఎవరైనా వైరల్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్(Skin Infection), ఏదైనా ఇతర అంటువ్యాధికి గురైన తర్వాత కోలుకుంటే, వారు తమ టూత్ బ్రష్‌ను మార్చుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాష్ రూమ్ ను కూడా సరిగా శుభ్రం చేయాలి. ఇంట్లోని ఇతర సభ్యులకు సోకకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్రష్(Brush) ద్వారా దంతాలను, నోటిని శుభ్రపరిచినపుడు ఆ క్రిములు, బ్యాక్టీరియాలు, టూత్‌పేస్ట్, ఆహార వ్యర్థాలు కొన్ని సందర్భాల్లో రక్తం టూత్ బ్రష్‌కు అంటుకుంటాయి. బ్రష్ చేసిన అనంతరం టూత్ బ్రష్‌ను నీటితో కడిగినప్పటికీ మన కంటికి కనిపించని సూక్ష్మజీవులతో బ్రష్‌కు అంటుకున్న మురికి అలాగే ఉంటుందని పలు అధ్యయనాల్లో నిరూపితమైంది. అదే బ్రష్‌ను మళ్లీ ఉపయోగిస్తే రోగాల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ టూత్ బ్రష్(Tooth Brush)ను శుభ్రంగా ఉంచుకోవాలి.
టూత్ బ్రష్ హ్యాండిల్స్, బ్రిసిల్స్‌పై వేలాది రకాల సూక్ష్మజీవులు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. వీటితో మరీ అంత ప్రమాదం లేకపోయినా కొన్ని సూక్ష్మ క్రిములు ఫ్లూ, వాంతులు, విరేచనాలు ఇతర ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తాయి. అదే విధంగా ఒకే బ్రష్‌ను రెండు నెలలకు మించి వాడకూడదని సూచిస్తున్నారు.