Chromium deficiency and food: క్రోమియం లోపిస్తే ఈ అనారోగ్యం.. తినాల్సిన ఫుడ్ ఇదే-find diseases with chromium deficiency and know chromium rich foods here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chromium Deficiency And Food: క్రోమియం లోపిస్తే ఈ అనారోగ్యం.. తినాల్సిన ఫుడ్ ఇదే

Chromium deficiency and food: క్రోమియం లోపిస్తే ఈ అనారోగ్యం.. తినాల్సిన ఫుడ్ ఇదే

HT Telugu Desk HT Telugu
Feb 15, 2023 09:28 AM IST

Chromium deficiency and food: క్రోమియం లోపం వల్ల అసాధారణ అనారోగ్యాలేవీ ఏర్పడవని, అయితే క్రోమియం తగిన స్థాయిలో ఉండడం వల్ల డయాబెటిస్, పీసీఓఎస్ వంటి పేషెంట్లలో పరిస్థితి మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు సూచించాయి.

క్రోమియం లోపాన్ని నివారిస్తే డయాబెటిస్, పీసీఓఎస్ పేషెంట్ల పరిస్థితి మెరుగుపడుతుందన్న అధ్యయనాలు
క్రోమియం లోపాన్ని నివారిస్తే డయాబెటిస్, పీసీఓఎస్ పేషెంట్ల పరిస్థితి మెరుగుపడుతుందన్న అధ్యయనాలు (MINT_PRINT)

Chromium deficiency and food: క్రోమియం మన శరీరంలో ప్రొటీన్ జీవక్రియను మెరుగుపరిచి ఇన్సులిన్ చర్యను ప్రోత్సహిస్తుంది. అలాగే యాంటీఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటుంది. అయితే క్రోమియం లోపంతో అసాధారణమైన అనారోగ్యాలు ఏవీ ఉండవని, క్రోమియం లోపం ఏర్పడినప్పుడు సంబంధిత ఆహారం తీసుకుంటే శరీరం అనారోగ్యం నుంచి తిరిగి పుంజుకుంటుందని పలు అధ్యయనాలు సూచించాయి. డయాబెటిస్, పీసీఓఎస్ పేషెంట్లలో క్రోమియం సప్లిమెంట్లు పరిస్థితిని మెరుగుపరుస్తాయని అధ్యయనం తేల్చింది. అయితే అధిక సప్లిమెంట్లు అనర్థాలకు దారితీస్తాయని అధ్యయనం సూచించింది.

క్రోమియం లోపంతో ఈ అనారోగ్యం

క్రోమియం లోపం కారణంగా అసాధారణ అనారోగ్యాలు ఏవీ నమోదు కాలేదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే క్రోమియం లోపం కారణంగా అసాధారణమైన లక్షణాలు కూడా ఏవీ కనిపించవని అవి చెబుతున్నాయి. అయితే కొన్ని నాడీ సంబంధిత సమస్యలు, హైపర్‌గ్లైసీమియా, బరువు కోల్పోవడం, పెరిఫెరల్ న్యూరోపతి, గ్లూకోజ్ నిరోధకత, గందరగోళం వంటి సమస్యలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే డయాబెటిస్ పేషెంట్లలో క్రోమియం లోపం కారణంగా ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉంటున్నట్టు ఆయా అధ్యయనాలు స్పష్టం చేశాయి. క్రోమియం సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ మెరుగుపడ్డాయని తేలింది.

అలాగే పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడం, అధిక ట్రైగ్లైజరైడ్ స్థాయిలు, అధిక కొలెస్ట్రాల్ స్థాయి, హైపర్ టెన్షన్, ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం వంటి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యకు కూడా క్రోమియం సప్లిమెంట్లు పనిచేశాయని ఒక అధ్యయనం సూచించింది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా గుండె జబ్బులు, డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్యాలు చోటు చేసుకుంటాయి. వీటన్నింటికి ప్రధాన కారణం ఇన్సులిన్ నిరోధకతే అని సంబంధిత అధ్యయనం సూచించింది. వీరిలో క్రోమియం సప్లిమెంట్లు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని ఆ అధ్యయనం తేల్చింది. అలాగే పీసీఓఎస్ పేషెంట్లలో కూడా క్రోమియం సప్లిమెంట్లతో గ్లూకోజ్ నియంత్రణ, లిపిడ్ లెవెల్స్ మెరుగుపడడం సాధ్యమైందని మరో అధ్యయనం తేల్చింది.

క్రోమియం డైట్ ఇదే..

శరీరంలో ఉన్న క్రోమియం నష్టపోకుండా ఉండాలంటే కూల్ డ్రింక్స్, సోడా, ఆల్కహాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే శాచ్యురేటెడ్ కొవ్వులు, సోడియం తగ్గించాలి. నట్స్, గుడ్లు, తేలికైన మాంసాహారంలో క్రోమియం లభిస్తుంది. అలాగే సముద్ర చేపలు, బీన్స్, బఠానీ, పప్పులు, సోయా ఉత్పత్తుల్లో క్రోమియం లభిస్తుంది. అలాగే గ్రేప్స్, ఆరేంజ్, టమాటా, ఆపిల్, బీన్స్, అరటి పండు వంటి వాటిలో క్రోమియం లభిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం