Chana Pulao: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా చనా పలావు చేసుకోండి, రుచి అదిరిపోతుంది-chana pulao recipe in telugu know how to make this rice recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chana Pulao: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా చనా పలావు చేసుకోండి, రుచి అదిరిపోతుంది

Chana Pulao: నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా చనా పలావు చేసుకోండి, రుచి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Feb 27, 2024 05:30 PM IST

Chana Pulao: చనాతో చేసిన వంటకాలు టేస్టీగా ఉంటాయి. చనాతో చేసిన పలావ్ వండి చూడండి. ఇది పిల్లలకు, పెద్దలకు కచ్చితంగా నచ్చుతుంది. దీని అదిరిపోవడం ఖాయం.

చనా పులావ్ రెసిపీ
చనా పులావ్ రెసిపీ (youtube)

Chana Pulao: చనా అంటే చిక్పీస్, కాబూలీ శెనగలు అని కూడా అంటారు. కొందరు తెల్ల కొమ్ము శెనగలు అని కూడా పిలుస్తారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చనాతో టేస్టీగా పులావ్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా పనికొస్తుంది. అలాగే డిన్నర్ లో వేడివేడిగా తినేందుకు టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ఇది నచ్చడం ఖాయం. ఒకసారి దీన్ని చేసుకొని తిని చూడండి. చనా పులావ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

చనా పులావ్ రెసిపీ‌కి కావలసిన పదార్థాలు

బాస్మతి బియ్యం - ఒక కప్పు

చిక్ పీస్ - ఒక కప్పు

ఉల్లిపాయ - ఒకటి

టమోటా - ఒకటి

క్యారెట్ - ఒకటి

బఠానీలు - గుప్పెడు

నూనె - మూడు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పసుపు - అర స్పూను

కారం - ఒక స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నిమ్మ రసం - ఒక స్పూను

చనా పులావ్ రెసిపీ

1. బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు ముందే నానబెట్టుకోవాలి.

2. అలాగే చిక్ పీస్‌ను ముందే ఉడకబెట్టి రెడీగా పెట్టుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.

4. ఆ నూనెలో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.

5. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారేవరకు ఉంచాలి.

6. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

7. అందులోనే సన్నగా తరిగిన టమోటాలను, క్యారెట్, బఠానీలను వేసి వేయించాలి.

8. కాస్త ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

9. టమోటాలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

10. తర్వాత మూత తీసి పసుపు, కారం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

11. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చిక్ పీస్ ను వేసి కలుపుకోవాలి.

12. ఐదు నిమిషాల పాటు ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని తీసి ఈ గిన్నెలో వేయాలి.

13. కాస్త గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

14. ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా వదిలేయాలి.

15. కాసేపయ్యాక కుక్కర్ మూత తీసి పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అలాగే నిమ్మకాయను పిండుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చనా పులావ్ రెడీ అయినట్టే.

చనా అంటే కాబూలీ సెనగలు అంటారు. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, రక్తప్రసరణకు సహాయపడతాయి. ఈ కాబూలీ శెనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి తినాల్సిన అవసరం ఉంది. ఎవరైతే తరచూ కాబూలీ శనగలను ఆహారంలో భాగం చేసుకుంటారో, వారికి జ్వరం, జలుబు వంటివి రాకుండా ఉంటాయి.

కొమ్ము శెనగలు, కాబూలీ శెనగలు రెండూ ఒకే జాతికి చెందినవి. వీటిలో ఏది తిన్నా ఆరోగ్యకరమే. ముందుగా నానబెట్టుకున్న తరువాత కుక్కర్లో ఉడికించుకొని కాస్త పోపు వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. ప్రతిరోజూ గుప్పెడు శనగలను తినడం అలవాటుగా చేసుకోండి. ఇది డయాబెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తుం.ది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలా తినాలనిపించకపోతే పైన చెప్పినట్టు చనా పలావ్ రెసిపీని ప్రయత్నించండి.

Whats_app_banner