Cardiac Arrest : కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడే వారికి వెంటనే సీపీఆర్ చేయాలి.. ఎందుకంటే
Cardiac Arrest : ప్రతి సంవత్సరం భారతదేశంలో చాలామంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఆ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే సీపీఆర్ అందించాలని.. లేని పక్షంలో వారి ప్రాణాలు కాపాడటం చాలా కష్టమని వైద్యులు తెలుపుతున్నారు. ఇంతకీ దాని లక్షణాలు.. ఏమి చేస్తే పేషెంట్ బతికే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Cardiac Arrest : కార్డియాక్ అరెస్ట్ బాధితుల్లో 10 మందిలో ఏడుగురికి సకాలంలో కార్డియోపల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) అందించినట్లయితే.. వారిని రక్షించవచ్చని వైద్యులు తెలిపారు. శరీరంలో ఎలక్ట్రికల్ ప్రేరణలలో కలిగే అంతరాయం కార్డియాక్ అరెస్ట్‌ను ప్రేరేపిస్తుందని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGIMS) కార్డియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఆదిత్య కపూర్ తెలిపారు. ఆ సమయంలో గుండె కీలక అవయవాలకు రక్తాన్ని పంపడం ఆపేస్తుంది. దానివల్ల మెదడు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభిస్తుంది. రోగికి ఎవరూ సహాయం చేయకపోతే.. కచ్చితంగా మరణిస్తారని ఆదిత్య వెల్లడించారు.
ఏజేపీ అబ్దుల్ కలాం ఉపన్యాసం ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇలా జరిగింది. ఎవరైనా సీపీఆర్ అందించి ఉంటే ఆయనను రక్షించి ఉండేవారని ఆదిత్య తెలిపారు. నటి రీమా లాగూ విషయంలోనూ అదే జరిగిందని ఆయన పేర్కొన్నారు. పునీత్ రాజ్ కుమార్, బుల్లితెర నటుడు సిద్ధార్థ్ కూడా దీని వల్లే ప్రాణాలు వదిలేశారు.
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
ఈ ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది భారతదేశంలో ప్రతి సంవత్సరం రెండు మిలియన్ల మందిని చంపుతుంది. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటు కంటే భిన్నమైనది. ఛాతీ నొప్పి, అసౌకర్యం, చేతులు, వెన్ను, మెడ, దవడ, దంతాలు, పొత్తికడుపులో నొప్పిని కలిగించే అడ్డంకి కారణంగా రక్త ప్రసరణ ఆగిపోతుంది. చల్లని చెమటతో పాటు.. అలసట, గుండెల్లో మంట లేదా అజీర్ణం, మైకము కూడా దాని లక్షణాలు కావచ్చు.
SCAలో రోగులు పల్స్ లేదా శ్వాస లేకుండా అకస్మాత్తుగా కుప్ప కూలిపోతారు. గుండె లోపాలు, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటివి తెలియని వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
"CPR రక్తం మెదడుకు చేరుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి వైద్య సహాయం వచ్చే వరకు CPR నిర్వహించాలి" అని కార్డియాలజిస్ట్ తెలిపారు. అయితే శిక్షణ పొందిన సభ్యులు మాత్రమే ప్రాణాలను కాపాడగలరని గుర్తించుకోండి. నాడి, శ్వాస తప్పిపోయినట్లయితే.. వెంటనే CPR ప్రారంభించాలి. బాధితుడు వైద్య సహాయం వచ్చే వరకు దానిని కొనసాగించాలని తెలిపారు.
సంబంధిత కథనం