White Sauce Pasta Recipe : అల్పాహారంలోకి పాస్తా.. ఎంతో రుచిగా ఉంటుంది-breakfast recipes how to make white sauce pasta in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Breakfast Recipes How To Make White Sauce Pasta In Telugu

White Sauce Pasta Recipe : అల్పాహారంలోకి పాస్తా.. ఎంతో రుచిగా ఉంటుంది

HT Telugu Desk HT Telugu
Mar 14, 2023 06:33 AM IST

White Sauce Pasta : వైట్ సాస్ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. అయితే ఇది ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

వైట్ సాస్ పాస్తా
వైట్ సాస్ పాస్తా

మనకు రెస్టారెంట్లలో లభించే వాటిలో వైట్ సాస్ పాస్తా ఒకటి. వైట్ సాస్ పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో ఇష్టంగా లాగించేస్తారు. తినే కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అయితే దీనిని ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. సులభంగా వైట్ సాస్ పాస్తాను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు

బ‌ట‌ర్-2 టేబుల్ స్పూన్స్, మైదాపిండి-ఒక‌టిన్నర టేబుల్ స్పూన్స్, పాలు-300 ఎమ్ ఎల్, పాస్తా-ఒక‌టిన్నర క‌ప్పు, ఆలివ్ ఆయిల్-2 టీ స్పూన్స్, వెల్లుల్లి త‌రుగు-అర టీ స్పూన్స్, ఉల్లిపాయ త‌రుగు-రెండు టీ స్పూన్స్, త‌రిగిన ఎల్లో క్యాప్సికం ముక్కలు-అర క‌ప్పు, త‌రిగిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు-అర క‌ప్పు, త‌రిగిన రెడ్ క్యాప్సికం ముక్కలు-అర క‌ప్పు, రెడ్ చిల్లీ ప్లేక్స్-అర టీ స్పూన్, ఉప్పు-త‌గినంత‌, మిరియాల పొడి-అర టీ స్పూన్, ఇటాలియ‌న్ హెర్బ్స్-అర టీ స్పూన్, ఉడికించిన ప‌చ్చి బ‌ఠాణీ-అర క‌ప్పు, నీళ్లు-ముప్పావు క‌ప్పు, ఫ్రెష్ క్రీమ్-2 టీ స్పూన్స్, మోజ‌రెల్లా చీజ్-అర క‌ప్పు.

మెుదట ఓ కళాయిలో బటర్ వేసి వేడి చేయాల్సి ఉంటుంది. బటర్ వేడి అయ్యాక మైదాపిండి కలుపుకోవాలి. మైదాపిండి చక్కగా వేగి.. బటర్ పైకి రావాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇది చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి. మైదాపిండి మిశ్రమం కొద్దిగా చిక్కబడగానే.. స్టౌవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. గిన్నెలో రెండు లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె వేసి నీటిని మరిగించుకోవాలి.

నీళ్లు మరిగిన తర్వాత పాస్తా వేసుకోవాలి. పాస్తా చక్కగా ఉడికిన తర్వాత వడకట్టి ప్లేట్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. కళాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్, ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత.. వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి పెద్ద మంట మీద పచ్చి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి.

అనంతరం ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఇటాలియన్ హెర్బ్స్ వేసి కాసేపు ఉంచాలి. తర్వాత బఠాణీ వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వైట్ సాస్(మైదాపిండి మిశ్రమం) కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దీనిని బటర్ పైకి తేలే వరకూ మంటపై ఉడికించాలి. ఉడికించిన తర్వాత పాస్తా వేసి కలపాలి. నాలుగు నిమిషాలు ఉడికించాక.. ఫ్రెష్ క్రీమ్, చీజ్ వేసి కలుపుకోవాలి. మరో రెండు నిమిషాలు ఉడికించి.. స్టౌవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉండే వైట్ సాస్ పాస్తా రెడీ అవుతుంది. ఈ పాస్తాను అల్పాహారంగా తీసుకోవచ్చు.

WhatsApp channel

టాపిక్