Bread Upma | బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ ఉప్మా.. కొంచెం సాఫ్ట్, కొంచెం క్రిస్పీ!
ఉప్మాలో కూడా ఎన్నో వెరైటీలు ఉంటాయి. అందులో బ్రెడ్ ఉప్మా రుచి వేరే ఉంటుంది. మీకు బ్రెడ్ ఉప్మా చేసుకోవాలనుకుంటే ఇక్కడ రెసిపీ ఇచ్చాం, ప్రయత్నించి చూడండి. 10 నిమిషాల్లో సిద్ధం అవుతుంది.
ఉప్మాలో కూడా ఎన్నో వెరైటీలు ఉటాయి రవ్వ ఉప్మా, వెర్మీ సెల్లీ ఉప్మా, సాబుదానా ఉప్మా, రైస్ ఉప్మా, చింతపండు ఉప్మా, ఇడ్లీ ఉప్మా, మిల్లెట్ ఉప్మా ఇలా సుమారు 40కి పైగా ఉప్మా వెరైటీలు ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇంకా త్వరగా, ఇంకా సులభంగా చేసుకునే బ్రెడ్ ఉప్మా గురించి విన్నారా? కేవలం 10 నిమిషాల్లో ఈ టిఫిన్ సిద్ధమైపోతుంది.
డ్ ఉప్మా ఎక్కువగా కారం ఉండదు, ముద్దగా కూడా ఉండదు. చాలా మృదువుగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. కావాల్సింది బ్రెడ్, క్యారెట్, బీన్స్ మొదలైనవి. మీకు వెజిటేబుల్స్ లేకపోయినా కేవలం బ్రెడ్ ఇంకా కొన్ని స్పైసెస్ ఉంటే చాలు బ్రెడ్ ఉప్మా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఉంది. ఒకసారి చేసుకొని తినండి, నచ్చితే మళ్లీ ఎప్పుడైనా చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- 4 బ్రెడ్ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్ నూనె
- 1 ఉల్లిపాయ
- 1/4 కప్పు క్యారెట్
- 1/4 కప్పు బీన్స్
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- 1/4 కప్పు వేరుశెనగ
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 9-10 కరివేపాకు ఆకులు
- 1 నిమ్మకాయ
- 1 పచ్చిమిర్చి
- ఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం
- బాణలిలో నూనె వేసుకొని వేడయ్యాక ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇలా ఒక నిమిషం పాటు వేయించాలి.
- అనంతరం తరిగిన కూరగాయలను వేసి కలపండి. 2-3 నిమిషాల పాటు వీటిని ఉడికించండి.
- ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బీన్స్, వేరుశనగ, ఇతర పప్పులను వేయించండి.
- ఇప్పుడు బ్రెడ్ ముక్కలను చిన్నచిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేయండి.
- బ్రెడ్ ముక్కలు కొద్దిగా క్రిస్పీగా మారేంత వరకు వేయించండి.
- మంట తగ్గించి నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకోండి.
కొంచెం క్రిస్పీ, కొంచెం సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన బ్రెడ్ ఉప్మాను తింటూ ఆస్వాదించండి.
సంబంధిత కథనం