best phone under 30000: రూ.30,000 లోపు ఉన్న బెస్ట్ 5G ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!-best mobile phones under 30000 in india check the list ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Best Phone Under 30000: రూ.30,000 లోపు ఉన్న బెస్ట్ 5g ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!

best phone under 30000: రూ.30,000 లోపు ఉన్న బెస్ట్ 5G ఫోన్లు ఇవే..ఓ లుక్కేయండి!

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 04:47 PM IST

best 5G phone under 30000: ఇండియాలో త్వరలో 5G నెట్‌వర్క్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5G స్మార్ట్‌ఫోన్‌లకు మారాలని చూస్తున్నారు. ప్రస్తుతం 5G సపోర్ట్‌ను అందించే అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ, వాటిలో మంచి ఫీచర్స్, రూ. 30000 లోపు ఉన్న ఉత్తమ 5G ఫోన్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.

<p>best phone under 30000</p>
best phone under 30000

భారత్‌లో 5G నెట్‌వర్క్ త్వరలో లాంచ్ కానుంది. అక్టోబర్ 2022 చివరి నాటికి 5G సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 5G హై స్పీడ్ ఇంటర్నెట్ దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. చైనీస్ మెుబైల్ కంపెనీ రియల్‌మీ ఇప్పటికే భారతదేశంలో మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండేళ్ల క్రితం విడుదల చేయగా... అమెరికన్ టెక్ కంపెనీ మీడియాటెక్ భారతీయ స్మార్ట్‌పోన్ మార్కెట్ కోసం కొత్త 5G స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్‌ను విడుదల చేసింది. ఈ చిప్ చౌక స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించబడుతుంది. ఇది అధునాతన కెమెరా ఫీచర్లకు, సూపర్ పవర్ అందేలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చాలా మంది 5G స్మార్ట్‌ఫోన్‌లకు మారాలని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం 5G సపోర్ట్‌ను అందించే అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నప్పటికీ, వాటిలో మంచి ఫీచర్స్, రూ. 30000 లోపు ఉత్తమ 5G ఫోన్‌ల గురించి ఇప్పుడు చూద్దాం.

మోటరోలా ఎడ్జ్ 30

Motorola Edge 30 ఎడ్జ్ 30.. 5జీ సిరీస్‌లో చేరిన తాజా స్మార్ట్‌ఫోన్. ఇది స్నాప్‌డ్రాగన్ 778G+ 5G ప్రాసెసర్, 144Hz 10-బిట్ పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAMతో జత చేయబడింది. స్మార్ట్‌ఫోన్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరెజ్‌ను కలిగి ఉంది. ఎడ్జ్ 30 ప్రపంచంలోనే అత్యంత స్లీమ్‌గా ఉండే 5G స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.

Motorola Edge 30లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అద్భుతమైన సెల్ఫీలు, వీడియో కాల్‌లకు స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత My UXలో నడుస్తుంది. 6.7-అంగుళాల పూర్తి-HD+ OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. Motorola Edge 30.. 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లతో పాటు Android 13. 14కి అప్‌గ్రేడ్ చేయబడుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. స్మార్ట్‌ఫోన్ ధర రూ.27,999 నుండి రూ.29,999 వరకు ఉంది.

OnePlus Nord 2T 5G

MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌తో OnePlus Nord 2T రూపొందించారు. ఇది 12GB వరకు RAM, 256GB వరకు స్టోరెజ్‌ను కలిగి ఉంది. ఈ పోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,500mAh బ్యాటరీని ప్యాక్ కలిగి ఉంది. దాదాపు 30 నిమిషాల్లో డివైజ్‌ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

OnePlus Nord 2T ట్రిపుల్ రియర్ కెమెరా కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది, ఇందులో OIS సామర్థ్యంతో 50-మెగాపిక్సెల్ Sony IMX766 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా అలాగే 2-మెగాపిక్సెల్ థర్డ్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలను క్యాప్చర్ చేయడానికి 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా స్టెబిలైజ్డ్ వీడియోలను క్యాప్చర్ చేయగల EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సామర్థ్యాన్ని కలిగి ఉంది.

OnePlus Nord 2T 8 GB RAM + 128 GB, 12 GB RAM + 256 GB అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బేస్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ. 28,999 కాగా టాప్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ధర రూ. 33,999.

Redmi K50i

6.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తున్న Redmi K50i ఫోన్ వినియోగదారులు ఆకట్లుకుంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ డాల్బీ విజన్ డిస్‌ప్లేతో పాటు 7- స్టెప్స్ డైనమిక్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 1 బిలియన్ కలర్స్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఫోన్ 20.5:9 యాస్పెక్ట్ రేషియోతో ఎక్కువ కాలం పాటు ఉపయోగించుకోవడానికి సౌకర్యవంతమైన గ్రిప్‌ను కలిగి ఉంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో సింగిల్ కెమెరాను పొందుతుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ 64MP ISOCELL ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాను అందిస్తుంది. సెల్ఫీలు తీసుకునే విషయంలో 16MP ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది.

ఈ ఫోన్ MediaTek డైమెన్సిటీ 8100 SoCతో వేగవంతమైన పనితీరును కలిగి ఉంది. డైమెన్సిటీ 8100 SoC 6GB RAM + 128 GB స్టోరేజ్ లేదా 8GB RAM + 256 GBతో జత చేయబడింది. పరికరంలోని 5080 mAh బ్యాటరీ అందించడం వల్ల ఎక్కువ లైఫ్ కలిగి ఉంటుంది. 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఫోన్‌ను కేవలం 30 నిమిషాల వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్ 6జీబీ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8జీబీ వేరియంట్ ధర రూ.28,999గా ఉంది.

Realme 9 Pro+

Realme 9 Pro+ 90Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను పొందుతుంది. ఇది డైమెన్సిటీ 920 SoC ఆధారితంగా పని చేస్తుంది. గరిష్టంగా UFS 3తో 6/8 GB RAM, 128/ 256GB స్టోరేజ్ కలిగి ఉంది.1

బ్యాటరీ పరంగా, Realme 9 Pro+ 60W SuperDart ఛార్జింగ్‌తో పాటు 4500mAh బ్యాటరీని పొందుతుంది. కేవలం 45 నిమిషాల్లోనే డివైజ్ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.

Realme 9 Pro+ ధరను చూస్తే.. 6GB+128GB వేరియంట్‌ ధర రూ. 26,049గా ఉండగా.. 8GB + 128GB వేరియంట్‌ ధర రూ. 27,049 ఉంది. టాప్ స్పెక్ 8GB + 256GB వేరియంట్‌ ధర రూ. 29,049.

iQOO నియో 6

iQOO Neo 6 6.62-అంగుళాల E4 AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్, 80W ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీ మరియు 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అమర్చబడింది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమైనది, గరిష్టంగా 12GB RAMతో జత చేయబడింది.

భారతదేశంలో iQOO Neo 6 ధర 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ. 29,999గా నిర్ణయించబడింది, అయితే హై-ఎండ్ 12GB + 256GB ఎంపిక ధర రూ. 33,999. ఇది సైబర్ రేజ్ మరియు డార్క్ నోవా కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది

Xiaomi 11i హైపర్‌ఛార్జ్

Xiaomi 11i హైపర్‌ఛార్జ్ 5G బేస్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 ఉండగా.. 8GB + 128GB వేరియంట్‌ ధర రూ. 28,999గా ఉంది.

ఫోన్ 20:9 యాస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 920 SoCతో 6.67-అంగుళాల పూర్తి-HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8GB LPDDR4x RAMతో జత చేయబడింది.

కెమెరా ముందు భాగంలో, హ్యాండ్‌సెట్ 108MP కెమెరా ప్రైమరీ Samsung HM2 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్, 2MP మాక్రో షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

సెల్ఫీ కెమెరా f/2.45 లెన్స్‌తో 16MP ఉండగా.. ఫోన్‌లో 4,500mAh డ్యూయల్-సెల్ లిథియం పాలిమర్ బ్యాటరీ అందించారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పనిచేస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం