Nokia's IFA 2022 Recap | టెక్ ఫెయిర్‌లో Nokia X30 5G సహా వివిధ ప్రొడక్టులు లాంచ్-hmd global launches nokia x30 5g and other devices at ifa 2022 check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nokia's Ifa 2022 Recap | టెక్ ఫెయిర్‌లో Nokia X30 5g సహా వివిధ ప్రొడక్టులు లాంచ్

Nokia's IFA 2022 Recap | టెక్ ఫెయిర్‌లో Nokia X30 5G సహా వివిధ ప్రొడక్టులు లాంచ్

HT Telugu Desk HT Telugu
Sep 04, 2022 03:49 PM IST

జర్మనీలో జరుగుతున్న అతిపెద్ద యురోపియన్ టెక్ ఫెయిర్ IFA 2022లో కంపెనీలు తమ ప్రొడక్టులను ప్రదర్శిస్తున్నాయి. నోకియా కంపెనీ Nokia X30 5G, Nokia C31, Nokia G60 5G స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, Nokia T21 టాబ్లెట్ ను విడుదల చేసింది.

Nokia launches its products in IFA 2022
Nokia launches its products in IFA 2022

జర్మనీలోని బెర్లిన్‌లో ఇటీవల జరిగిన IFA 2022లో అనేక టెక్ కంపెనీలు తమ ప్రొడక్టులను లాంచ్ చేశాయి. HMD గ్లోబల్ సంస్థ కూడా సరికొత్త Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా మరికొన్ని నోకియా ఉత్పత్తులను విడుదల చేసింది. వీటిలో Nokia C31, Nokia G60 5G అలాగే Nokia T21 టాబ్లెట్ ఉన్నాయి. వీటి గురించి క్లుప్తంగా ఇక్కడ తెలుసుకోండి.

Nokia X30 5G

నోకియా X-సిరీస్ లో వచ్చిన సరికొత్త మోడల్‌ Nokia X30 5G స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ పరిశీలిస్తే.. ఇది 100% రీసైకిల్ అల్యూమినియంతో తయారు చేసిన మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంది, అయితే ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ మాత్రం 65% రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసినది.

ఫీచర్లను పరిశీలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.43-అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లే ఉంది. ఇది 700 nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఈ డివైజ్ శక్తివంతమైన Qualcomm Snapdragon 695 5G చిప్‌తో ఆధారితమైనది. ఈ ఫోన్ 6GB RAM +128GB లేదా 8GB RAM +128GB స్టోరేజ్‌ అనే రెండు కాన్ఫిగరేషన్లతో వస్తుంది.

ఇంకా ఈ ఫోన్‌లో 4200mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP67 సర్టిఫికేషన్, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మొదలైనవి ఉన్నాయి. Nokia X30 5G క్లౌడీ బ్లూ లేదా ఐస్ వైట్ కలర్‌ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. దీని ధర సుమారు రూ. 42 వేలు. అయితే బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్‌ను కలిగి ఉండదు. ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిందే.

ఇతర ఉత్పత్తులు - Nokia G60, Nokia C31, Nokia T21

నోకియా G60 స్మార్ట్‌ఫోన్‌లో 6.58-అంగుళాల FHD+ 120Hz డిస్‌ప్లే ఉంటుది. ఇది 50MP ప్రైమరీ సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో మూడేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉంటాయి, మూడేళ్లపాటు వారంటీతో వస్తుంది.

నోకియా C-సిరీస్‌లో Nokia C31 అనేది కొత్త ఎంట్రీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7-అంగుళాల HD డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉన్నాయి.

చివరగా, నోకియా T21 అనేది నోకియా టాబ్లెట్, ఇది రెండు సంవత్సరాల Android నవీకరణలు, మూడు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో వస్తుంది. ఫీచర్లను పరిశీలిస్తే ఈ ఫోన్ 360 నిట్స్ బ్రైట్‌నెస్ అందిచే 10.4-అంగుళాల 2K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంకా 8200mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్‌ సపోర్ట్ ఉన్నాయి. ఈ టాబ్లెట్ Unisoc T612 చిప్‌తో ఆధారితం. స్టోరేజ్ పరంగా 4GB RAM, 64GB లేదా 128GBతో వస్తుంది. వెనుక 8MP, ముందువైపు 8MP కెమెరాలు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్