Coconut Cooler | సమ్మర్లో రిఫ్రెష్మెంట్ డ్రింక్.. కూల్ చేసే కొకొనట్ కూలర్
వేసవి వచ్చేసింది. గంటకొకసారి కూల్‌గా ఏదో ఒకటి తాగాలనిపించే కాలం ఇది. మన గొంతులు ఎండిపోయే సమయం కూడా ఇదే. ఈ సమయంలోనే మనం డీహైడ్రేషన్‌కు గురవుతాము. ఈ క్రమంలో రోజంతా సిప్ చేయడానికి మనకు ఏదైనా మనకు కావాల్సిందే. ఈ వేసవి తాపాన్ని తగ్గించి.. ఆరోగ్యాన్ని అందించే పానీయం ఇక్కడ రెడీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయిపోండి.
వేసవి కాలం మనకు చెమటలు పట్టేలా చేస్తుంది. ఈ సమయంలో శరీరం తనను తాను రీహైడ్రేట్ చేసుకోవాలని చూస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన పోషకాలను మనం శరీరానికి అందిస్తూనే ఉండాలి. ఈ పోషకాలను అందించడానికి, వేడి నుంచి ఉపశమనం ఇవ్వడానికి కొబ్బరి కూలర్ మీకు సహాయంచేస్తుంది. దీనిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చుద్దాం.
కావాల్సిన పదార్థాలు
* కొబ్బరి నీరు- 2 కప్పులు
* 1/2 నిమ్మకాయ- పై తొక్కతో
* నారింజ - 1
* తేనె - 1 టేబుల్ స్పూన్
* ఐస్ క్యూబ్స్ - 3 లేదా 4
తయారీ విధానం
నారింజ తొక్క తీసి.. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ కలపి బ్లెండర్లో వేయాలి. దానిలో తేనె, ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేయాలి. ఇది మెత్తగా బ్లెండ్ అయిన తర్వాత వడకట్టాలి. అనంతరం కొబ్బరిలో వేసి దానిని సర్వ్ చేసుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు..
నారింజ, దానిపై తొక్క, తేనె, నిమ్మకాయ శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు, పొటాషియం, సోడియం కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో కూడా పొటాషియం, సోడియం ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. హైడ్రేటెడ్‌గా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. సమ్మర్లో వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
సంబంధిత కథనం