Bagara Rice Recipe : హైదరాబాద్ స్పెషల్ బగారా రైస్.. ఇలా చేసేయండి..
Bagara Rice Recipe : పండగొచ్చినా.. పబ్బమొచ్చినా.. ఇంట్లో బగారా రైస్ ఉండాల్సిందే. కోడి కూర అయినా.. మటన్ కర్రీ చేసినా.. దానికి కాంబినేషన్ బగారా రైస్ చేసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. అలాగే దానిని వెజ్ కర్రీలతో కూడా కలిపి తీసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Bagara Rice Recipe : బగారా రైస్‌ని స్పైసీ రైస్‌గా చెప్పవచ్చు. దీనిని చేయడం చాలా సులభం కూడా. ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో టేస్టీ టేస్టీ రైస్ చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేసుకోవచ్చు.. కావాల్సిన పదార్థాలు ఏమిటి? దీనిని మరింత టేస్టీగా ఎలా వండుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* బాస్మతీ రైస్ - 1 బౌల్
* దాల్చిన చెక్క - 1
* లవంగాలు - 4
* యాలకులు - 4
* షాజీరా - 1 టీస్పూన్
* పెప్పర్ - 1 టీస్పూన్
* ఉల్లిపాయ - 1 కట్ చేసుకోవాలి
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 టేస్పూన్
* పచ్చిమిర్చి - 4 కట్ చేసుకోవాలి
* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్ (కట్ చేసుకోవాలి)
* ఉప్పు - తగినంత
* గరం మసాలా - 1/2 స్పూన్
* నెయ్యి - 2-3 టేబుల్ స్పూన్
* నీళ్లు - 5-6 కప్పులు
బగారా రైస్ తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి నీళ్లలో వేసి నానబెట్టండి. ఇప్పుడు హాండీని వేడి చేసి దానిలో నెయ్యి వేసి కరిగించండి. దానిలో మొత్తం మసాలా దినుసులు వేసి చిటపటలాడనివ్వండి. ఉల్లిపాయ వేసి దాని రంగు వచ్చేవరకు వేయించండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి వేయించండి. దానిలో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలిపి ఉడికించాలి.
అనంతరం బియ్యం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి.. వేయించండి. ఇప్పుడు దానిలో నీళ్లు పోసి అధిక మంట మీద ఉడికించాలి. నీరు మరగడం ప్రారంభించిన తర్వాత.. 30-40 నిమిషాలు దమ్ మీద ఉంచండి. అంతే బగారా రైస్ రెడీ. దీనిని వేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్