Potato Recipe : బంగాళదుంప రైస్.. తయారు చేయండి ఈజీగా ఇలా.. టేస్టీగా ఉంటుంది చాలా
Potato Recipe In Telugu : బంగాళదుంప రైస్ తయారు చేయడం చాలా ఈజీ. చాటా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని చేసేందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు.
బంగాళదుంపతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా ఉత్తమమైనది. పొటాటో రైస్ చేసందుకు సమయం కూడా ఎక్కువగా పట్టదు. చాలా ఈజీగా తయారు చేయవచ్చు. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన రుచి వంటకం చేయడానికి బియ్యంతో బంగాళదుంప కలిపి వండితే బాగుంటుంది. ఇలా వందలాది వంటలు అన్నంతోనే తయారు చేసుకోవచ్చు.
అన్నం వండేటప్పుడు అందులో ఏ కూరగాయ వేసినా అది ప్రత్యేక వంటకం అవుతుంది. మీరు చాలా కూరగాయలను జోడించినట్లయితే, మీరు పలావ్ చేయవచ్చు. ఒక్క బంగాళాదుంప వేసి ఆలూ రైస్ తయారు చేసుకోవచ్చు. మీరు ఉదయాన్నే అల్పాహారంలా దీనిని తీసుకుని.. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి తీసుకెళ్లవచ్చు. ఈ ఆలూ రైస్ తయారు చేయడం చాలా సులభం.
ఈ బంగాళదుంప రైస్‌ని కొన్ని పదార్థాలను ఉపయోగించి తక్కువ సమయంలో తయారు చేయవచ్చు. ఇంతకీ ఈ ఆలూ రైస్ చేయడానికి మనకు కావలసిన పదార్థాలు ఏమిటి? ఈ బంగాళదుంప అన్నం ఎలా తయారు చేయాలి?
బంగాళదుంప రైస్‌కు కావాల్సిన పదార్థాలు
బంగాళదుంప 2 , బియ్యం - 1 గిన్నె, జీలకర్ర - 1/2 tsp, కరివేపాకు కొన్ని, రెడ్ చిల్లీ పౌడర్ - 1/2 tsp, పసుపు పొడి - 1/4 tsp, ఎండు మిర్చి - 2, పచ్చిమిర్చి - 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp, ఉల్లిపాయ - 1, కొత్తిమీర - 1/4 కప్పు, రుచికి ఉప్పు, వంట నునె కొద్దిగా..
బంగాళదుంప రైస్ తయారీ విధానం
ముందుగా పాత్రలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. సుమారు 5 నిమిషాలు వేయించాలి.
5 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి, ఎండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారపు పొడి వేసి వేయించాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో మీ దగ్గర ఉన్న అన్నం వేయాలి.
అన్నం వేసిన తర్వాత మంట తగ్గించి బాగా వేయించాలి. చివరగా కొన్ని కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అంతే స్టవ్ ఆఫ్ చేయండి. మీకు నచ్చే రుచికరమైన ఆలూ రైస్ మీ ముందు రెడీ. ఇది వేడిగా ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది.
మీరు ఈ అన్నంలో గుడ్డును కూడా జోడించవచ్చు. బంగాళదుంపలు, గుడ్లు ఉత్తమ రుచిని అందిస్తాయి. మీరు ఇదే అన్నంలో బీట్‌రూట్‌ను కూడా జోడించవచ్చు. బంగాళదుంపలు, బీట్‌రూట్‌లను ఉడకబెట్టవచ్చు. లేకుంటే వేయించుకోవచ్చు.