Ash Gourd Juice health Benefits: బరువు తగ్గడానికి బూడిద గుమ్మడి జ్యూస్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్-ash gourd juice weight loss miracle with many benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ash Gourd Juice Health Benefits: బరువు తగ్గడానికి బూడిద గుమ్మడి జ్యూస్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్

Ash Gourd Juice health Benefits: బరువు తగ్గడానికి బూడిద గుమ్మడి జ్యూస్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్

HT Telugu Desk HT Telugu
Aug 26, 2023 09:30 AM IST

Ash Gourd Juice: బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది దీనిని కేవలం దిష్టి తీయడానికే అనుకుంటారు. దీని ప్రయోజనాలు తెలిస్తే దిష్టి తీసిపడేయడానికి కాదు.. ఇంటిలోపలకి తీసుకెళ్లి దాచుకుంటారు. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. అవేంటో తెలుసుకోండి.

ash gourd: బూడిద గుమ్మడి కాయతో ఆరోగ్య ప్రయోజనాలు
ash gourd: బూడిద గుమ్మడి కాయతో ఆరోగ్య ప్రయోజనాలు (pixabay)

బూడిద గుమ్మడికాయ అధిక పోషక విలువలతో నిండి ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది దాని ప్రయోజనాలు పొందడం మానేసి కేవలం దిష్టి తీసి పడేసేందుకే ఉపయోగిస్తున్నారు. బూడిద గుమ్మడికాయ రసంతో తాగితే కలిగే బెనిఫిట్స్ తెలిస్తే దానిని మీ డైట్లో కచ్చితంగా భాగం చేసుకుంటారు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంతో పాటు మిమ్మల్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. ఇదే కాకుండా దీనితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హెడ్రేట్ చేస్తుంది

బూడిద గుమ్మడికాయలో 96 శాతం నీరు ఉంటుంది. దీనితో తయారు చేసిన రసం తాగితే మీరు కూడా హెడ్రేట్​గా ఉంటారు. డ్రై స్కిన్, డ్రై హెయిర్​తో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

బూడిద గుమ్మడి కాయ కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. కావాలంటే మీరు ఒక నెల రోజులు ట్రై చేసి పరీక్షించి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. కొలెస్టరాల్ తగ్గితే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తపోటును అదుపు చేస్తుంది

బూడిద గుమ్మడి రసం మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీనిలో విటమిన్ సి, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. అవసరమైన విటమిన్లతో నిండిన ఈ రసం రక్తంలోని చక్కెరను తగ్గించడానికి గొప్ప ఏజెంట్ గా పనిచేస్తుంది.

శ్వాస సమస్యలకై

బూడిద గుమ్మడి రసం శ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్రోన్కైటిస్, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధుల్లో చికిత్సకు సాంప్రదాయ వైద్యంలో బూడిద పొట్లకాయ రసాన్ని ఉపయోగిస్తారు.

ఖాళీ కడుపుతో తాగితే..

ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడి రసాన్ని తాగితే మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. మంచి జీర్ణ క్రియను పోషిస్తుంది. ఇది పేగు కదలికలను, జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా ఇది మీలో pH స్థాయిని అదుపులో ఉంచుతుంది. దానివల్ల ఎసిడిటీ, అల్సర్ల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

బరువు తగ్గేందుకు..

బూడిద గుమ్మడికాయ డ్రింక్ తక్కువ కేలరీలతో నిండి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఒక హెల్తీ డ్రింక్ అవుతుంది. కాబట్టి మీ రోజును ఓ గ్లాసు బూడిద గుమ్మడికాయ రసంతో ప్రారంభించండి. దానిలోని ఫైబర్ కంటెంట్ మీ మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు చేకూరిన దీనిని ఎక్కువగా తీసుకోకండి. మితంగా తీసుకున్నప్పుడే దీని బెనిఫిట్స్ పూర్తిగా పొందుతారు. అప్పుడే దానిలోని పోషకాలు మీ శరీరానికి అందుతాయి.

Whats_app_banner