కొన్ని రకాల పండ్లలో సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో అవి తింటే శరీరంలో రక్త ప్రవాహం మెరుగై.. కొలెస్ట్రాల్ లెవెళ్లను తగ్గిస్తాయి. అలా.. కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడే 5 రకాల పండ్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Photo: Unsplash
అరటి పండ్లలో ఫైబర్, పొటాషియమ్ ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్లడ్ ప్లజర్, కొలెస్ట్రాల్‍ను నియంత్రణలో ఉంచుకునేందుకు అరటి ఉపయోగపడుతుంది.
Photo: Unsplash
అవకాడోల్లో మోనోసాచురేటెడ్, పాలిఅన్‍సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీంతో ఇవి తింటే గుండె ఆరోగ్యానికి మంచిది. అలాగే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Photo: Unsplash
యాపిల్ పండ్లలో సోలబుల్ ఫైబర్, పోలిఫెనోల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో కొలెస్ట్రాల్ లెవెళ్లను నియంత్రణలో ఉంచుకునేందుకు యాపిల్ తోడ్పడుతుంది.
Photo: Unsplash
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు లాంటి బెర్రీస్‍ల్లో యాంటియాక్సిడెంట్లు, మంటను తగ్గించే పదార్థాలు ఉంటాయి. దీంతో కొలెస్ట్రాల్‍ను మేనేజ్ చేసుకునేందుకు బెర్రీలు కూడా సహకరిస్తాయి.
Photo: Unsplash
ధమనుల్లో పేరుకొని ఉన్న కొలెస్ట్రాల్ తగ్గేందుకు తోడ్పడే బ్రొమెలైన్.. పైనాపిల్ పండులో ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగయ్యేందుకు, గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించేందుకు పైనాపిల్ ఉపయోగపడుతుంది.
Photo: Unsplash
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.