smartphone use by kids: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఆనంద్ మహీంద్రా ఏమన్నారో చూడండి-anand mahindra cautions against dangers of smartphone usage by kids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smartphone Use By Kids: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఆనంద్ మహీంద్రా ఏమన్నారో చూడండి

smartphone use by kids: పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? ఆనంద్ మహీంద్రా ఏమన్నారో చూడండి

Koutik Pranaya Sree HT Telugu
May 17, 2023 10:46 AM IST

smartphone use by kids: చిన్నతనం నుంచే ఫోన్ వాడకం వల్ల కలిగే నష్టాల గురించి ఒక సర్వేలో తేలిన విషయాల్ని బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా తల్లిదండ్రులకు ఇచ్చిన సూచనలేంటో చూడండి.

"Incredibly disturbing. Research being conducted by Sapien Labs and Krea University, AP, shows that the age at which a child first owns a smartphone affects their mental well-being in adulthood. I join many others in urging parents to exercise caution & restraint," wrote Chairman of the Mahindra group.
"Incredibly disturbing. Research being conducted by Sapien Labs and Krea University, AP, shows that the age at which a child first owns a smartphone affects their mental well-being in adulthood. I join many others in urging parents to exercise caution & restraint," wrote Chairman of the Mahindra group.

మొబైల్ వాడకం వల్ల కలిగే నష్టాలను నీతి వ్యాక్యాలతో, వీడియోలు కార్టూన్లతో ఎప్పుడడూ తన ఫాలోవర్లకు వివరిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. సోమవారం రోజున ట్విట్టర్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ లోని సేపియన్ ల్యాబ్స్, క్రియా యూనివర్సిటీ చేసిన సర్వే గురించి పంచుకున్నారు.

సేపియన్ ల్యాబ్స్, క్రియా యూనివర్సిటీ చేసిన సర్వే ప్రకారం.. చిన్న వయసులో పిల్లలు ఏ వయసులో ఫోన్ వాడకం మొదలు పెడతారో, దానికీ పెద్దయ్యాక వాళ్ల మానసిక ఆరోగ్యానికి సంబంధం ఉంది.

ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య 18 నుంచి 24 ఏళ్ల వయసున్న 27,969 మంది మీద ఈ సర్వే చేశారు. వాళ్లు ఏ వయసులో స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్ వాడకం మొదలు పెట్టారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ల మానసిక ఆరోగ్యంతో పోల్చి చూశారు. గతంలో వాడిన ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రభావం పెద్దయ్యాక ఎలా ఉంటుందనే విషయం గురించి ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

కాస్త పెద్ద వయసు నుంచి మొబైల్ వాడకం మొదలెట్టిన యువతలో మానసిక ఆరోగ్యం బాగుందని తేలింది. సుసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు, కోపం, విసుగు, వాస్తవానికి దూరంగా ఉండేతత్వం లాంటి లక్షణాలు వీళ్లలో తక్కువగా ఉన్నాయట.

చిన్న వయసు నుంచే సొంత మొబైల్ వాడిన వాళ్లలో ముఖ్యంగా పదేళ్ల వయసు కన్నా ముందే ఫోన్ వాడినవాళ్లు మానసిక ఆరోగ్యం బాలేదని తేలింది. ముఖ్యంగా ఈ ప్రభావం అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల మీద ఎక్కువుంది. అయినప్పటికీ తక్కువ వయసులో మొబైల్ వాడకం మొదలుపెట్టడం మంచిది కాదని ఈ పరిశోధనలో వెళ్లడించారు.

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ భవిష్యత్తు తరాల మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం ముఖ్యం.