Nipah virus: వామ్మో మళ్లీ నిఫా వైరస్ ఎంట్రీ, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి-again nipah virus entry go to hospital immediately if these symptoms appear ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nipah Virus: వామ్మో మళ్లీ నిఫా వైరస్ ఎంట్రీ, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి

Nipah virus: వామ్మో మళ్లీ నిఫా వైరస్ ఎంట్రీ, ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి

Haritha Chappa HT Telugu
Jul 23, 2024 07:00 PM IST

Nipah virus: నిఫా వైరస్ ఎంతో భయంకరమైనది. ఇది ప్రాణాలు సులువుగా తీసేస్తుంది. గతంలో నిఫా వైరస్ కేరళలో ఎంతో మందిని బలి తీసుకుంది. ఇది మనుషులు, జంతువుల్లో కూడా వ్యాప్తి చెంతుంది. ఇప్పుడు మళ్లీ నిఫా వైరస్ తన ఉనికిని చాటుతోంది.

నిఫా వైరస్
నిఫా వైరస్ (NIH / IMAGE POINT FR/picture alliance)

నిఫా వైరస్… కేరళలో ఎంతో మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొన్ని నెలలుగా ఈ వైరస్ ఉనికి కనిపించలేదు. ఇది ఫ్రూట్ బ్యాట్స్ అంటే… ఒక రకమైన గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఇది మానవులకు ప్రాణాంతకమైనది. దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో 2024 జూలై 21 ఆదివారం నిఫా వైరస్ తో 14 ఏళ్ల బాలుడు మరణించాడు. దీంతో అధికారుల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఫ్రూట్ బ్యాట్స్‌లో నిఫా వైరస్ ఉండడం సర్వసాధారణం. ఇవి అధిక జనాభా కలిగిన రాష్ట్రమైన కేరళకు సమీపంలో అటవీ ప్రాంతాలలో నివసిస్తాయి. ఈ వైరస్ పందులలో కూడా కనిపిస్తుంది. జంతువుల నుంచి మనుషులకు ఇది సోకుతుంది. కలుషితమైన ఉత్పత్తుల ద్వారా కూడా పరోక్షంగా వ్యాప్తి చెందవచ్చు. మనుషుల నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ వైరస్ మెదడువాపును ప్రేరేపిస్తుంది. ఈ వైరస్ తేలికపాటి నుండి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. చివరికి ఇది మరణానికి దారితీస్తుంది.

నిఫా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది?

కీటకాలను తినే, జంతువుల రక్తాన్ని తాగే గబ్బిలాలకు భిన్నంగా ఉంటాయి ఫ్రూట్ బ్యాట్స్. ఇవి తేనె, పూలపై ఉండే పుప్పొడిని తింటాయి. ఈ గబ్బిలాలలో నిఫా వైరస్ సాధారణంగా కనిపిస్తుంది. ఫ్రూట్ గబ్బిలాలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. తమను తాము ఓరియెంటెడ్ చేయడానికి అల్ట్రాసౌండ్ కాకుండా వాటి కళ్ళను ఉపయోగిస్తాయి.

ఫ్రూట్ గబ్బిలాల నుంచి పందులు, పశువులు, మానవులకు కూడా నిఫా వైరస్ ఎలా వ్యాపిస్తుందో శాస్త్రవేత్తలకు ఇంకా ఖచ్చితంగా అర్థం కావడం లేదు. ఫ్రూట్ బ్యాట్స్ నుంచి వచ్చే కలుషిత లాలాజలం, మూత్రంతో ద్వారా మానవులు, జంతువులకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి.

2018లో కేరళలో నిఫా వ్యాప్తికి కారణం మంచినీటిలో కలుషితం కావడమేనని తేల్చారు. కేరళలో నిఫా సోకిన కుటుంబానికి చెందిన బావిలో చనిపోయిన ఫ్రూట్ గబ్బిలాలు కనిపించాయి. తొలుత కుటుంబ సభ్యుల్లో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత వారి పరిచయస్తులు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీన్ని ఆ ఫ్రూట్ బ్యాట్స్ పడిన బావిలోని నీరు తాగడం వల్లే వారికి నిఫా వైరస్ సోకినట్టు నిర్ధారించారు.

నిఫా వైరస్ లక్షణాలు

నిఫా వైరస్ మెదడుపై తీవ్రంగా ప్రభావితం చేస్తుంది . ఈ వైరస్ శరీరంలో చేరాక ఐదు రోజుల నుంచి రెండు వారాల వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. ప్రారంభ లక్షణాలు ఫ్లూను పోలి ఉంటాయి. జ్వరం, వికారం, తీవ్రమైన తలనొప్పి లక్షణాలు నిఫా వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయి. కొంతమంది రోగులకు శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. తరువాత మైకము, గందరగోళం వంటి పరిస్థితులు వస్తాయి. ఒకట్రెండు రోజుల్లోనే రోగులు కోమాలోకి వెళ్లి చనిపోతారు. నిఫా వైరస్ సోకిన తరువాత 70 శాతం మరణించే అవకాశం ఉంది.

నిఫా వైరస్ చికిత్స

నిఫా వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు లేదా మందులు లేవు. మందులు ఇప్పటివరకు లక్షణాలను తగ్గించగలిగాయి. నిఫా వైరస్ సోకిన వెంటనే రోగులను ఐసోలేట్ చేయాలి. వారి దగ్గరకు ఎవరూ వెళ్లకూడదు. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి.

నిఫా వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది?

1998లో మలేషియాలోని సుంగాయ్ నిఫా అనే గ్రామంలో తొలిసారిగా నిఫా వైరస్ ను కనుగొన్నారు. అక్కడ కబేళాల్లో పనిచేసే పురుషులకు మొదట ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. జంతువుల నుంచి ఈ వ్యాధి వారికి సోకినట్టు గుర్తించారు.

అదే సమయంలో మలేషియాలోని పందుల్లో గుర్తుతెలియని వ్యాధికారకం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ స్వల్పంగా వ్యాప్తి చెందింది. ఆ తర్వాతే కార్మికులు, పందులకు ఒకే వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముందుజాగ్రత్తగా, మలేషియాలో 1 మిలియన్ కంటే ఎక్కువ పందులను చంపారు.అప్పటి నుండి, బంగ్లాదేశ్లో 2001, 2003లో, కేరళలో 2018, 2021, 2023 సంవత్సరాల్లో నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి.

Whats_app_banner