Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ చిత్రంలో ఆంగ్ల అక్షరం Bల మధ్య 8 అంకె ఇరుక్కుంది, పదిసెకన్లలో దాన్ని కనిపెట్టండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని సాల్వ్ చేయడానికి మెదడు చురుగ్గా పనిచేయాలి. ఇక్కడ అలాంటి ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము.
Optical Illusion: మీకు ఆప్టికల్ ఇల్ల్యూషన్లంటే ఆసక్తి ఎక్కువ. మీ మెదడుకు సవాలు విసిరే మరొక ఆప్టికల్ ఇల్ల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ చిత్రంలో ఆంగ్ల అక్షరం B లు ఉన్నాయి. వాటి మధ్యలో ఒకచోట ఎనిమిది అంకె ఇరుక్కుని ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టి చెప్పడమే మీ పని. ఎక్కువ సమయం తీసుకుంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ కేవలం 10 సెకన్లలో మాత్రమే మీరు ఈ జవాబును కనిపెట్టి చెప్పాలి. అప్పుడు మీరు తోపు అని ఒప్పుకుంటాము
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
మీ మెదడు, కంటిచూపు సమన్వయంగా పనిచేస్తే 8 అంకెను మీరు 10 సెకన్ల లోపే గుర్తిస్తారు. అలా గుర్తించిన వారికి కంగ్రాట్స్. ఇక గుర్తించలేని వారికి ఇక్కడ మేము జవాబు చెబుతున్నాము. చివరి నుంచి మూడో లైన్లో 8 అంకె ఉంది. పరిశీలనగా చూస్తే ప్రతి ఒక్కరికీ దొరుకుతుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను అప్పుడప్పుడు చేధిస్తూ ఉండండి. ఇది మీ కంటి చూపుకు, మెదుడుకు మంచి పరీక్షను పెడుతుంది. వాటిని మరింత పదునుగా పనిచేసేలా చేస్తుంది.
అన్ని ఆప్టికల్ ఇల్యూషన్లతో పోలిస్తే నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. మెదడు, కంటి చూపు ఎప్పుడైతే అనుసంధానంగా పనిచేస్తాయో అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ఈ ఆప్టికల్ చిత్రాలు మెదడును, కంటి చూపును సమన్వయంగా పనిచేసేలా చేస్తాయి. ప్రతిరోజూ ఇలాంటి ఆప్టికల్ ఇల్ల్యూషన్లను ఛేదించడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మీరు చాలా తెలివైన వారుగా మారుతారు.
పిల్లలకు ఇలాంటి ఆప్టికల్ చిత్రాలను సాల్వ్ చేయమని ఇస్తూ ఉండండి. ఇది వారికి ఎంతో మేలు జరిగేలా చేస్తుంది. వారి మెదడు పనిచేసే శక్తి మెరుగుపడి చదువు కూడా వస్తుంది. చిన్న పిల్లలకు సింపుల్ ఆప్టికల్ చిత్రాలు ఉన్నాయి. అలాగే టీనేజీ పిల్లలకు కాస్త కష్టతరమైన ఆప్టికల్ ఇల్యూషన్లు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వీటి హవా ఎంతో నడుస్తోంది. మీకు ఆసక్తి ఉంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోవచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ లోని కొన్ని పేజీలు ఆప్టికల్ ఇల్యూషన్ల కోసమే నడిపిస్తున్నారు. అలాంటి వాటిని ఫాలో అయినా సరిపోతుంది.
టాపిక్