Homemade Face Masks : చలికాలంలో మెరిసే చర్మం కోసం ఇంట్లో చేసిన ఫేస్ మాస్క్‌లు-7 homemade face masks can shine your face in winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Homemade Face Masks : చలికాలంలో మెరిసే చర్మం కోసం ఇంట్లో చేసిన ఫేస్ మాస్క్‌లు

Homemade Face Masks : చలికాలంలో మెరిసే చర్మం కోసం ఇంట్లో చేసిన ఫేస్ మాస్క్‌లు

Anand Sai HT Telugu
Jan 14, 2024 02:00 PM IST

Homemade Face Masks In Telugu : చలికాలం చర్మం పాడవుతూ ఉంటుంది. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు వాడే బదులుగా ఇంట్లో తయారు చేసిన ఫేస్‌ మాస్క్‌లు ఉపయోగించండి.

ఫేస్ మాస్క్‌లు
ఫేస్ మాస్క్‌లు (Unsplash)

చల్లని వాతావరణంతో చర్మంపై ఉన్న సహజ తేమ పోతుంది. చర్మం పొడిగా, నిస్తేజంగా మారుతుంది. చలికాలంలో వీచే చల్లని గాలులు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. మీ చర్మ సంరక్షణ దినచర్యను మెరుగుపరిచేందుకు ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. మీ చర్మం హైడ్రేటెడ్‌గా, మెరుస్తూ ఉంటుంది. వంటగదిలో దొరికే సహజ పదార్థాలను ఉపయోగించి మంచి ఫేస్ మాస్క్‌లను తయారు చేయవచ్చు. అవేంటో చూద్దాం..

పెరుగు పోషక ప్రయోజనాలతో ఉంటుంది. అయితే ఇందులో తేనెను కలపండి. రెండు టేబుల్ స్పూన్ల సాదా పెరుగును ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించి, 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తేనె తేమను జోడిస్తుంది, పెరుగు చర్మాన్ని మృదువుగా, రిఫ్రెష్ చేస్తుంది.

సగం అవకాడోను మెత్తగా చేసి, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత 15-20 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. అవకాడో పండులో సహజ నూనెలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫేస్ మాస్క్ పొడి చర్మాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగపడుతుంది.

దోసకాయ తురుము, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దోసకాయ చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. కలబంద చర్మానికి ఓదార్పు ప్రభావాన్ని ఇస్తుంది. ఈ మాస్క్ సున్నితమైన చర్మానికి అనుకూలంగా ఉంటుంది. మృదువుగా, రిఫ్రెష్‌గా చేస్తుంది.

రెండు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనెను ఒక టేబుల్‌స్పూన్ బ్రౌన్ షుగర్ కలపండి. వృత్తాకార కదలికలో మీ ముఖంపై మిశ్రమాన్ని మసాజ్ చేయాలి. ఆ తర్వాత కడగాలి. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా చేస్తుంది. మృదువైన చర్మం అవుతుంది.

రెండు టేబుల్ స్పూన్ల గ్రీక్ పెరుగుతో కొన్ని పండిన స్ట్రాబెర్రీలను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. స్ట్రాబెర్రీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీక్ పెరుగు చర్మాన్ని ప్రకాశవంతంగా, హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

పండిన అరటిపండును మెత్తగా చేసి, దానికి ఒక టీస్పూన్ బాదం నూనె మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి కడుక్కోవాలి. అరటిపండ్లు విటమిన్లు, తేమతో నిండి ఉంటాయి. బాదం నూనె మీ చర్మానికి ప్రకాశవంతమైన మెరుపును జోడిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్ మీల్ ను తగినంత పాలతో కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. వృత్తాకార కదలికలో మీ ముఖంపై మిశ్రమాన్ని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఓట్ మీల్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. అదే సమయంలో పాలు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. చర్మాన్ని మృదువుగా మార్చడమే కాకుండా తాజా కాంతివంతమైన ఛాయను అందిస్తుంది.

WhatsApp channel