Egg White Face Masks : కోడిగుడ్డులోని తెల్లసొనతో ఫేస్ ప్యాక్స్.. ముఖం మెరిసిపోతుంది..-6 homemade egg white face masks for glowing and clear skin know how to make in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Egg White Face Masks : కోడిగుడ్డులోని తెల్లసొనతో ఫేస్ ప్యాక్స్.. ముఖం మెరిసిపోతుంది..

Egg White Face Masks : కోడిగుడ్డులోని తెల్లసొనతో ఫేస్ ప్యాక్స్.. ముఖం మెరిసిపోతుంది..

Anand Sai HT Telugu
Jun 08, 2024 02:00 PM IST

Egg White Face Masks In Telugu : కోడిగుడ్డుతోని చేసే ఫేస్ ప్యాక్స్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఇందులోని తెల్లసొనను మాత్రమే ఉపయోగించాలి. దానితో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

ఎగ్ వైట్ ఫేస్ మాస్క్
ఎగ్ వైట్ ఫేస్ మాస్క్

ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీని కోసం చాలా మంది తమ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి దుకాణాల్లో అమ్మే రకరకాల స్కిన్ కేర్ క్రీములను వాడుతుంటారు. అయితే కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా సహజసిద్ధమైన ఉత్పత్తులతో చర్మాన్ని సంరక్షించుకుంటే చర్మం చాలా కాలం పాటు ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.

గుడ్డులోని తెల్లసొన చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే పదార్థం. శతాబ్దాలుగా గుడ్డులోని తెల్లసొనను సౌందర్య సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా చర్మం ముడతలు, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది.

ఈ ఎగ్ వైట్ ఫేస్ ప్యాక్‌ని అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న అదనపు జిడ్డు, మురికి తొలగిపోయి చర్మం మెరుస్తూ, ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఎలాంటి చర్మ సమస్యకైనా గుడ్డులోని తెల్లసొనను ఫేస్ ప్యాక్‌గా ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం.

మొటిమలకు

ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అందులో 1 టీస్పూన్ నిమ్మరసం, 1/2 టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి, ముందుగా తడి గుడ్డతో తుడవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి ఆరనివ్వాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయండి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు సార్లు ఉపయోగించండి.

డార్క్ స్కిన్

గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి 1 టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్, 1/2 టీస్పూన్ పసుపు పొడిని కలపండి. ఇప్పుడు ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. చర్మం ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.

పొడి చర్మం

బాగా పొడిబారిన చర్మం ఉన్నవారు ముందుగా గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా అవకాడోను గుజ్జులో వేయాలి. తర్వాత 1 టీస్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 1-2 సార్లు ఉపయోగించండి.

డార్క్ స్పాట్స్

డార్క్ స్పాట్ సమస్య ఉన్నవారు ఒక గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మేకప్ బ్రష్ ఉపయోగించి ముఖంపై వైట్ ఎసెన్స్ అప్లై చేయండి. ఆ తర్వాత పైన ఒక టిష్యూ వేయాలి. గుడ్డులోని తెల్లసొనను మళ్లీ అప్లై చేయాలి. దీన్ని 10 నిమిషాలు నాననివ్వాలి. బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. మంచి ఫలితాల కోసం దీన్ని వారానికి ఒకసారి ఉపయోగించండి.

సెన్సిటివ్ స్కిన్

ఈ స్కిన్ ఉన్నవాళ్లు గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దానికి 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ పెరుగు, 1 టీస్పూన్ దోసకాయ రసం కలపండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగి చర్మాన్ని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించండి.

జిడ్డు చర్మం

మీ ముఖం జిడ్డుగా ఉంటే.. గుడ్డులోని తెల్లసొనను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సగం నిమ్మకాయ రసం వేసి కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. మెరిసే ముఖం కోసం ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2 సార్లు ఉపయోగించండి.

Whats_app_banner