Cleanest Beaches in India । ఇండియాలోని ఈ బీచ్‌లు పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరు!-5 cleanest and pleasant beaches in india you must visit ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cleanest Beaches In India । ఇండియాలోని ఈ బీచ్‌లు పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరు!

Cleanest Beaches in India । ఇండియాలోని ఈ బీచ్‌లు పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరు!

HT Telugu Desk HT Telugu
May 31, 2023 06:27 PM IST

Cleanest Beaches in India: భారతదేశం తీరం వెంబడి అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి. మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ఈ బీచ్‌లు పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరు.

Cleanest Beaches in India
Cleanest Beaches in India (Unsplash)

Cleanest Beaches in India: మనకు దగ్గర్లో బీచ్ ఉండటం ఒక వరం, ఆ బీచ్ పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంటే ఎంతో ఆనందం. సాయంత్రం వేళ సాగర తీరాన కూర్చొని సేదతీరడం, అందమైన సూర్యాస్తమయాన్ని వీక్షించడం, ఆహ్లాదకరమైన వాతావరణంను ఆస్వాదించడం, ఆత్మీయులతో కబుర్లు చెప్పడం, నోరూరించే సీఫుడ్ రుచిచూడటం ఒకటేమిటి ఇలాంటి అనేక రకాల అంశాలు బీచ్ మనకు అందిస్తుంది, మరపురాని క్షణాలను మన మదిలో నిలిపి ఉంచుతుంది.

భారతదేశం ఎంతో విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది, తీరం వెంబడి అనేక అందమైన బీచ్‌లు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యానికి కొదువేలేదు. అయితే ఇక్కడ మేము మీకు ఓ ఐదు సహజమైన బీచ్‌ల గురించి తెలియజేస్తున్నాం. ఈ బీచ్‌లు పరిశుభ్రతకు, ప్రశాంతతకు మారుపేరు. మీరు విహారయాత్రకు వెళ్లాలనుకుంటే ఈ బీచ్‌లకు ఓసారి తప్పకుండా వెళ్లిరండి.

వర్కల బీచ్, కేరళ

కేరళలోని వర్కాల తీర పట్టణంలోని వర్కాల్ బీచ్ ఉంది. ఈ బీచ్ ప్రకృతి సౌందర్యం, ప్రశాంతత కలిగిన అద్వితీయమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణం, చుట్టూ ఉత్కంఠభరితమైన శిఖరాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. పారదర్శకమైన సముద్ర జలాలలో జలకాలడవచ్చు, ఆయుర్వేద చికిత్సలను పొందవచ్చు.

పలోలెం బీచ్, గోవా

గోవాలోని పలోలెం బీచ్ ఇక్కడి బీచ్‌లన్నింటికంటే మరింత ప్రశాంతమైన, పరిశుభ్రమైన బీచ్‌గా నిలుస్తుంది. చుట్టూ సుందరమైన కొండలు, కొబ్బరి తోటలతో ఈ బీచ్ నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తుంది. నీటిలో ఈత కొట్టడం, తీరం వెంబడి షికారు చేయడానికి అద్భుతంగా ఉంటుంది.

మరారి బీచ్, కేరళ

అలెప్పీకి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో మరారి బీచ్ ఉంది. ఇది దాని సహజమైన అందం, పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందింది. ఈ బీచ్ తీరం వెంబడి బంగారు వర్ణపు ఇసుక, ఊగిసలాడే తాటి చెట్లు, అలల తరంగాలతో మనోహరమైన వాతావరణాన్ని అందిస్తుంది. సందర్శకులు బీచ్‌లో తీరికగా షికారు చేయవచ్చు, స్థానిక మత్స్యకారులను కార్యకలాపాలను గమనించవచ్చు.

గోకర్ణ బీచ్, కర్ణాటక

గోకర్ణ ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు ప్రసిద్ధి చెందిన తీర పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొన్ని పరిశుభ్రమైన, అత్యంత ప్రశాంతమైన బీచ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఓం బీచ్, కుడ్లే బీచ్ అనే రెండు బీచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ బీచ్‌ల తీరం వెంబడి సారవంతమైన బంగారు వర్ణపు ఇసుక, చుట్టూ రాతి శిఖరాలతో కనువిందు చేస్తాయి.

రాధానగర్ బీచ్, అండమాన్ - నికోబార్ దీవులు

హావ్‌లాక్ ద్వీపంలో ఉన్న రాధానగర్ బీచ్ ఆసియాలోని అత్యంత అందమైన బీచ్‌లలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది. పారదర్శకమైన జలాలు, సారవంతమైన తెల్లని ఇసుక తిన్నెలు, చుట్టూ పచ్చని చెట్లతో భువిపై వెలిసిన స్వర్గంలా ఉంటుంది. ప్రకృతి నడుమ విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి ఈ బీచ్ సరైన ప్రదేశం.

Whats_app_banner

సంబంధిత కథనం