2022 Mercedes-Benz C-Class | భారత మార్కెట్లోకి సరికొత్త బెంజ్ కార్!-2022 mercedes benz c class car launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  2022 Mercedes-benz C-class Car Launched In India

2022 Mercedes-Benz C-Class | భారత మార్కెట్లోకి సరికొత్త బెంజ్ కార్!

HT Telugu Desk HT Telugu
May 10, 2022 03:02 PM IST

2022 మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ కార్లు భారత మార్కెట్లోకి వచ్చేశాయి. ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. అన్నింటిలో 9-స్పీడ్ గేర్లు ఉన్నాయి. మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఈ కారులో ప్రత్యేకత. ధరలు, ఇతర వివరాలు చూడండి..

Mercedes benz C Class
Mercedes benz C Class (HT Photo)

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్-బెంజ్ తమ బ్రాండ్ నుంచి ఐదవ తరం సి-క్లాస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎంట్రీ-లెవల్ C200 పెట్రోల్ వెర్షన్ కారులో 1.5-లీటర్ 4-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది, ఈ ఇంజన్ 204hp శక్తి వద్ద 300Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ ధర ఎక్స్-షోరూం వద్ద రూ. 55 లక్షలు. 

C-క్లాస్ డీజిల్ లైనప్ C220dతో ప్రారంభమవుతుంది. ఇది 200hp శక్తి వద్ద, 440Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్-షోరూం వద్ద దీని ధర రూ. 56 లక్షలు. 

ఇక టాప్-ఎండ్ మోడెల్ C300d ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 265hp శక్తి వద్ద 440Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ధర రూ. 61 లక్షలు.

ఈ మూడు కార్లలోని ఇంజన్‌లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా జత చేసి ఇచ్చారు. అంతేకాకుండా ఇవి 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించినవి. ఇవి అదనంగా 20hp శక్తి 200Nm వరకు టార్క్‌ను అందించగల ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్ (ISG) సిస్టమ్‌తో వచ్చాయి.

ఈ సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ సి- క్లాస్ సలాటిన్ గ్రే, మొజావే సిల్వర్, హై-టెక్ సిల్వర్, మాన్యుఫాక్టూర్ ఒపలైట్ వైట్, కావాన్‌సైట్ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్ అనే 6 కలర్ ఛాయిస్ లలో లభ్యమవుతుంది.

పెట్రోల్ వెర్షన్ కారు ఒక లీటరుకు 16.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, డీజిల్ వెర్షన్ కారు లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. మొదటి రెండు వేరియంట్లు 7.3 సెకన్లలో 0 నుంచి 100 kph వేగాన్ని అందుకొంటుండగా, టాప్ వేరియంట్ 5.7 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఫీచర్లు..

2022 మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్‌కి 'బేబీ ఎస్-క్లాస్' అని ముద్దుగా పేరు పెట్టారు.ఎందుకంటే దీని ఇంటీరియర్ లేఅవుట్ దాదాపు అంతకుముందు వచ్చిన S-క్లాస్ మోడల్ నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉంది. క్యాబిన్ లోపల 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-జోన్ ఆటోమేటిక్ AC, 3-D మ్యాప్ నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్ సిస్టమ్‌తో కూడిన MBUX ఇంటర్‌ఫేస్, బయోమెట్రిక్ స్కానర్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

వెలుతురు లేమి, వాతావరణ హెచ్చరికలు, భారీవర్షాలలో సైతం కారు స్కిడ్ కాకుండా ఉండేందుకు ఈ కారులో ప్రత్యేక వ్యవస్థ ఉంది.

వీటితో పాటు, C-క్లాస్ బ్రేకింగ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, ఫ్రంట్- సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్