Winter Immunity Boost tips: చలికాలంలో ఇవి తింటే మంచిది.. రోగ నిరోధక శక్తి పెరిగేందుకు..
Nutrition tips for immunity boost in Winter: చలికాలంలో మీరు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తే రోగాల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Winter Immunity Boost tips: చలికాలంలో మీ ఆహారం ఈ మార్పులు చేస్తే మంచిది (Unsplash)
Nutrition tips for immunity boost in Winter: చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో ఎక్కువ మందికి సీజనల్ వ్యాధులు వస్తాయి. జ్వరం, జలుబు, దగ్గు లాంటి వాటి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి కూడా శీతాకాలంలో అనారోగ్య ప్రమాదం ఎక్కువ. అయితే చలికాలంలో కొన్ని ఆహార జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. మారిన వాతావరణానికి తగ్గట్టు శరీరానికి సరైన పోషకాలు అందిస్తే రోగాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. శీతాకాలంలో మీరు తీసుకునే ఆహారంలో ఏ మార్పులు చేస్తే రోగాలు దరిచేరే ప్రమాదం తగ్గుతుందో వెల్‍నెస్, డైటీషియన్ మన్‍ప్రీత్ కర్లా సూచించారు. ఆ 10 ఆహార చిట్కాలు ఇవే.
Nutrition tips for immunity boost in Winter: చలికాలం కోసం ఆహార చిట్కాలు
- మీ ఆహారంలో సజ్జలు, రాగి, రాజ్‍గిరా లాంటి చిరుధాన్యాలను చేర్చండి. మీ మొత్తం ఆరోగ్యం కోసం అసరమైన విటమిన్లు, ఖనిజాలను ఇవి మీ శరీరానికి అందిస్తాయి.
- మీ ఆహారంలో క్యారెట్, చిలకడదుంప, కంద లాంటి దుంప కూరగాయాలను తీసుకుండి. యాంటీ ఆక్సిడెంట్లు, కార్టెనాయిడ్స్ వీటిలో ఎక్కువగా ఉంటాయి. కణాలు డ్యామేజ్ కాకుండా ఇవి రక్షిస్తాయి.
- శీతాకాలంలో మజ్జిగకు బదులుగా పెరుగు తినండి. మీలో వెచ్చని శక్తిని పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. వేసవిలో అయితే మజ్జిగ మంచి ఆప్షన్.
- పోషకాలు అధికంగా ఉండేలా భోజనాన్ని చేయాలి. మీరు ఎక్కువ సేపు తృప్తిగా ఫీలయ్యేందుకు ఇది సహాయపడుతుంది.
- మీ ఆహారంలో బచ్చలికూర, ఆవఆకులు, ఉసిరి ఆకులు లాంటి ఆకుకూరలను చేర్చండి. మీ శరీరంలోని కణ ప్రక్రియను ఇవి నియంత్రించగలవు.
- గోద్ లడ్డూలను తీసుకోండి. మీ ఒంట్లో వేడి పుట్టేందుకు ఇది చాలా ఉపయోగపడతాయి.
- నిద్రకు ముందు పసుపు కలిపిన పాలను తాగండి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇది చాలా సహకరిస్తుంది.
- రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని ఉదయమే తాగండి. త్రిదోషాలను సమతుల్యం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- మీ చర్మం మృదువుగా, తేమగా ఉండేందుకు సరిపడా నీరు తాగుతూ ఉండండి.
- తులసి, యాలకులు, లవంగం, దాల్చిన చెక్క లాంటి సుగంధ ద్రవ్యాలు, దినుసులను మీ ఆహారంలో చేర్చండి. ఇవి మీ శరీరాన్ని వెచ్చగా ఉంచగలుగుతాయి.
టాపిక్