Zee5 Top Trending Movies: హనుమాన్ టాప్.. జీ5 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే-zee5 ott top trending movies hanuman tops the list the kerala story oppenheimer on the list ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Zee5 Ott Top Trending Movies Hanuman Tops The List The Kerala Story Oppenheimer On The List Ott News In Telugu

Zee5 Top Trending Movies: హనుమాన్ టాప్.. జీ5 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
Mar 22, 2024 10:48 PM IST

Zee5 Top Trending Movies: జీ5 ఓటీటీలో ప్రస్తుతం టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఏవో ఇక్కడ చూడండి. ఊహించినట్లే ఈ ఓటీటీలో హనుమాన్ మూవీ మొదటి నుంచీ టాప్ లో కొనసాగుతోంది.

హనుమాన్ టాప్.. జీ5 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే
హనుమాన్ టాప్.. జీ5 ఓటీటీలో టాప్ ట్రెండింగ్ మూవీస్ ఇవే

Zee5 Top Trending Movies: దేశంలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి జీ5 (ZEE5). ఈ ఓటీటీలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. అయితే శుక్రవారం (మార్చి 22) నాటికి ఈ ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం. ఈ లిస్టులో హనుమాన్, ది కేరళ స్టోరీ, ఓపెన్‌హైమర్ లాంటి సినిమాలు ఉండటం విశేషం.

జీ5 టాప్ ట్రెండింగ్ మూవీస్

ప్రస్తుతం జీ5 ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..

హనుమాన్

హనుమాన్ మూవీ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూసిన అభిమానులు.. మొత్తానికి గత ఆదివారం (మార్చి 17) సడెన్ గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. దీంతో తొలి రోజు నుంచే సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ.. టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జీ5 ఓటీటీలో తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లో హనుమాన్ అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ జియో సినిమాలో ఉన్న విషయం తెలిసిందే.

మై అటల్ హు

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ ఈ మూవీ. మై అటల్ హు జీ5 ఓటీటీలోకి మార్చి 14వ తేదీని వచ్చింది. థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ వచ్చిన మై అటల్ హు మూవీకి జీ5 ఓటీటీలోనూ మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ సినిమా ట్రెండింగ్ మూవీస్ లో రెండో స్థానంలో ఉంది.

ది కేరళ స్టోరీ

గతేడాది రిలీజైన ఈ వివాదాస్పద మూవీ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ది కేరళ స్టోరీ మూవీ చాలా రోజులుగా జీ5 ఓటీటీలోనూ అలాగే దూసుకెళ్తోంది. ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ మూవీస్ లో మూడో స్థానంలో ఉంది.

సామ్‌ బహదూర్

ఇండియా తొలి ఫీల్డ్ మార్షల్ మానెక్ షా జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ సామ్ బహదూర్. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమా థియేటర్లలోనూ మంచి విజయం సాధించింది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్రస్తుతం సామ్ బహదూర్ నాలుగో స్థానంలో ఉంది.

కడక్ సింగ్

జీ5 ఓటీటీ ఒరిజినల్ మూవీ కడక్ సింగ్. ఈ మూవీ రిలీజై చాలా రోజులే అవుతున్నా.. టాప్ ట్రెండింగ్స్ లిస్ట్ లో ఉంది. కడక్ సింగ్ మూవీలో బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠీ నటించాడు. ఈ థ్రిల్లర్ మూవీకి ఇప్పటికీ జీ5లో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఐదో స్థానంలో ఉంది.

తేజస్

కంగనా రనౌత్ నటించిన మూవీ తేజస్. థియేటర్లలో దారుణంగా విఫలమైన ఈ సినిమా జీ5 ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ సంపాదించింది. ప్రస్తుతం తేజస్ ఆరోస్థానంలో ఉంది.

కాటేరా

కన్నడ మూవీ కాటేరా జీ5 ఓటీటీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఏడో స్థానంలో ఉంది. దర్శన్ నటించిన ఈ సినిమాను థియేటర్లలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఓపెన్‌హైమర్

ఏడు ఆస్కార్స్ గెలిచిన హాలీవుడ్ మూవీ ఓపెన్‌హైమర్ ఇంగ్లిష్, హిందీ వెర్షన్లలో జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలోనే చూడాల్సి ఉంటుంది. ఓపెన్‌హైమర్ 8వ స్థానంలో ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో గదర్ 2, కిచిడీ 2 సినిమాలు ఉన్నాయి.

IPL_Entry_Point