సాధారణంగా సినిమాల్లో ఒక మనిషిని చంపేటప్పుడు మనకు ఒకింత బాధ కలుగుతుంది. కానీ.. మనిషిని చంపుతున్నా మన నవ్వుతూ చూస్తున్నామంటే అది డార్క్ కామెడీ. సౌత్‌లో డార్క్ కామెడీ సినిమాలు చాలా తక్కువ. అయితే.. ఇటీవల తమిళ్లో విడుదలైన ‘బ్లడీ బెగ్గర్’ మూవీ డార్క్ కామెడీలో కొత్త ఒరవడిని తీసుకొచ్చి ప్రేక్షకుల్ని థ్రిల్ చేసింది.
తమిళ్ యాక్టర్ కవిన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లడీ బెగ్గర్ మూవీ.. తెలుగులోనూ ఈ నవంబరు ఆరంభంలో విడుదలైంది. కానీ.. కవిన్ పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవడం.. అప్పటికే అమరన్, క, లక్కీ భాస్కర్ సినిమాలో పాజిటివ్ టాక్‌తో నడుస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. తమిళ్లో మాత్రం ఈ బ్లడీ బెగ్గర్ మూవీ రూ.7.34 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది.
బిచ్చగాడి అవతారంలో అందర్నీ మోసం చేస్తూ డబ్బులు అడుక్కునే కవిన్.. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకసారి అందరి బిచ్చగాళ్లతో కలిసి ఒక బంగ్లాలో దినం భోజనానికి వెళ్లి.. అక్కడ సౌకర్యాలు అన్నీ చూసి ఇంటికి వెళ్లకుండా అక్కడే దొంగచాటుగా ఉండిపోతాడు.
అయితే.. అప్పటికే ఆ బంగ్లాలో వారసత్వ ఆస్తి కోసం హత్యలు జరుగుతుంటాయి. ఇందులో కవిన్ ఎలా ఇరుక్కుంటాడు? చివరికి బయటపడతాడా? అనేది సినిమా. ఇందులో బోలెడు కామెడీ పాటు ఊహించని ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునే తీరు, వేసే ప్లాన్లు నవ్వులు తెప్పిస్తాయి. దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ ప్రతి విషయాన్ని ఒకదానికితో ఒకటి కనెక్ట్ చేస్తూ క్లైమాక్స్‌లో ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది.
బ్లడీ బెగ్గర్ మూవీ ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాని నవంబరు 29 నుంచి స్ట్రీమింగ్కి ఉంచబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ డేట్‌ను లాక్ చేసుకోండి.. డార్క్ కామెడీ మూవీని చూస్తూ కడుపుబ్బా నవ్వుకోండి.