OTT Murder Mystery Movie: ఓటీటీలో దేవర సినిమాని బీట్ చేసిన డిజాస్టర్ మూవీ, ట్విస్ట్‌లతో చలికాలంలోనూ చెమటలే!-flop murder mystery movie the buckingham murders become top on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Murder Mystery Movie: ఓటీటీలో దేవర సినిమాని బీట్ చేసిన డిజాస్టర్ మూవీ, ట్విస్ట్‌లతో చలికాలంలోనూ చెమటలే!

OTT Murder Mystery Movie: ఓటీటీలో దేవర సినిమాని బీట్ చేసిన డిజాస్టర్ మూవీ, ట్విస్ట్‌లతో చలికాలంలోనూ చెమటలే!

Galeti Rajendra HT Telugu
Nov 18, 2024 03:46 PM IST

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నవంబరులో ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టాప్‌లో ఉంటుందని అంతా ఊహించారు. కానీ.. థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలిన ఓ మర్డర్ మిస్టరీ మూవీ దేవరని బీట్‌ చేసి టాప్‌లోకి దూసుకొచ్చింది.

ది బకింగ్‌హామ్‌ మర్డర్స్ మూవీలో కరీనా కపూర్
ది బకింగ్‌హామ్‌ మర్డర్స్ మూవీలో కరీనా కపూర్

మర్డర్ మిస్టరీతో ఇటీవల చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని థియేటర్లలో హిట్ అవగా.. మరికొన్ని ఓటీటీలో సక్సెస్ అయ్యాయి. అలా థియేటర్లలో డిజాస్టర్‌గా మిగిలి ఓటీటీలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’. కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆకాశ్ టండన్, రణ్‌వీర్ బరార్, కైత్ అలెన్ తదితరులు నటించారు. ఈ సినిమాని శోభ కపూర్‌తో కలిసి సంయుక్తంగా కరీనా కపూర్ నిర్మించారు.

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా.. ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్-1ని బీట్ చేసి మరీ గత కొన్ని రోజుల నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.420 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టగా.. ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌ మూవీ కేవలం రూ.20 కోట్లని మాత్రమే వసూళ్లని రాబట్టుకోగలిగింది.

ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌ కథేంటి?

బ్రిటీష్ ఇండియన్‌ డిటెక్టివ్‌గా ఉన్న జస్మీత్ భమ్రా (కరీనా కపూర్) ఊహించని పరిస్థితుల్లో తన కొడుకుని కోల్పోతుంది. ఆమె ఆ బాధలో ఉన్నప్పుడే ఒక బాలుడి కిడ్నాప్ కేసు ఆమె ముందుకు వస్తుంది. ఆ కేసుని ఛేదించే క్రమంలో జస్మీత్ తన కుమారుడు చనిపోవడానికి అసలు కారణాన్ని కనిపెడుతుంది. అయితే.. ఈ కేసుని ఛేదించే క్రమంలో జస్మీత్ ఎదుర్కొనే సవాళ్లు, ట్విస్ట్‌లు.. ప్రేక్షకులు మంచి థ్రిల్‌ను ఇస్తాయి.

థియేటర్లలో ప్లాప్.. ఓటీటీలో హిట్

ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌.. మిస్టరీ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుందని ప్రమోషన్ ఈవెంట్స్‌లో కరీనా కపూర్ చెప్పుకొచ్చింది. కానీ.. సినిమా మాత్రం థియేటర్లలో తేలిపోయింది. స్టార్స్ మూవీలో ఉన్నా రూ.20 కోట్లతోనే సరిపెట్టింది. అయితే.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఓ మంచి ఫ్యాన్సీ రేటుకి ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసి స్ట్రీమింగ్‌కి పెట్టింది.

స్లోగా.. క్లిక్

తొలుత ది బకింగ్‌హామ్‌ మర్డర్స్ మూవీ ఓటీటీలో కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయినట్లు కనిపించింది. కానీ.. నెమ్మదిగా ఈ మర్డర్ మిస్టరీ ఓటీటీలో క్లిక్ అవుతూ.. ఇప్పుడు టాప్‌లోకి దూసుకొచ్చింది. హన్సల్‌ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Whats_app_banner