Weekend OTT Releases: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్-weekend ott releases aarambham prasanna vadanam rathnam kaliyugam pattanamlo in aha prime video netflix hotstar zee5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Weekend Ott Releases: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్

Weekend OTT Releases: ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu
May 23, 2024 04:02 PM IST

Weekend OTT Releases: వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన, రాబోతున్న సినిమాలతో ఫుల్ టైంపాస్ కానుంది. ఈ వారం ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీల్లోకి రాగా.. మరికొన్ని శుక్రవారం (మే 24) రిలీజ్ కానున్నాయి.

ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్
ఈ వీకెండ్ ఫుల్ టైంపాస్.. ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్

Weekend OTT Releases: వీకెండ్ వస్తుంటే చాలు ఓటీటీల్లోకి కొత్తగా రాబోయే సినిమాల గురించి ఆరా తీయడం సహజమే. ఈసారి ఆడియెన్స్ ను నిరాశ పరచకుండా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహా, ఈటీవీ విన్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లోకి ఎన్నో సినిమాలు వచ్చేశాయి. ఇంకా వస్తున్నాయి. మరి ఈ వీకెండ్ వీటిని చూస్తూ టైంపాస్ చేసేయండి.

వీకెండ్ ఓటీటీ రిలీజెస్

ప్రసన్న వదనం - ఆహా ఓటీటీ

సుహాస్ నటించిన మూవీ ప్రసన్న వదనం. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం (మే 24) నుంచి ఆహా ఓటీటీలోకి రాబోతోంది. ఒకవేళ ఆహా గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉంటే గురువారం (మే 23) నుంచే ఈ సినిమాను మీరు చూడొచ్చు.

ఆరంభం - ఈటీవీ విన్

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఆరంభం. థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోపే గురువారం (మే 23) నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మోహన్ భగత్ లీడ్ రోల్లో నటించాడు.

రత్నం - ప్రైమ్ వీడియో

తమిళ నటుడు విశాల్ నటించిన రత్నం మూవీ కూడా గురువారం (మే 23) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన నెల లోపే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో విశాల్ ప్రియా భవానీ శంకర్ నటించింది. నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గర నష్టాలను మిగిల్చిన ఈ సినిమా.. ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.

కలియుగం పట్టణంలో.. - ప్రైమ్ వీడియో

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలియుగం పట్టణంలో కూడా ఒకరోజు థియేటర్లలో ఆడి ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (మే 23) నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

గరుడ పురాణ - ప్రైమ్ వీడియో

కన్నడ హిట్ మూవీ గరుడ పురాణ కూడా ఏడు నెలల తర్వాత ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమాను రూ.79 రెంట్ పైనే అందుబాటులోకి తీసుకొచ్చారు.

మైదాన్ - ప్రైమ్ వీడియో

అజయ్ దేవగన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మైదాన్. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తాజాగా ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సినిమాను రూ.350 రెంట్ కట్టి చూడాల్సి ఉంటుంది.

డ్యూన్ 2 - జియో సినిమా

ఇక సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ డ్యూన్ 2 కూడా ఓటీటీలోకి ఈ వారమే వచ్చింది. మంగళవారం (మే 21) నుంచే ఈ మూవీ జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ - జియో సినిమా

మరో హాలీవుడ్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్‌డమ్ మూవీ కూడా మంగళవారం (మే 21) నుంచే జియో సినిమాలోకి వచ్చేసింది. ఈ మూవీని కూడా సబ్‌స్క్రిప్షన్ తో ఆ ఓటీటీలో చూడొచ్చు.

టీ20 వరల్డ్ కప్ 2024