Garuda Purana OTT: ఓటీటీలో రిలీజైన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ గరుడ పురాణ - ట్విస్ట్‌ల‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే!-kannada serial killer movie garuda purana streaming on amazon prime video now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Garuda Purana Ott: ఓటీటీలో రిలీజైన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ గరుడ పురాణ - ట్విస్ట్‌ల‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే!

Garuda Purana OTT: ఓటీటీలో రిలీజైన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ మూవీ గరుడ పురాణ - ట్విస్ట్‌ల‌ను ఊహించ‌డం క‌ష్ట‌మే!

Nelki Naresh Kumar HT Telugu
May 22, 2024 12:13 PM IST

Garuda Purana OTT: క‌న్న‌డంలో చిన్న సినిమాగా రిలీజై క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచిన గ‌రుణ పురాణ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూడొచ్చు.

గ‌రుణ పురాణ మూవీ ఓటీటీ
గ‌రుణ పురాణ మూవీ ఓటీటీ

Garuda Purana OTT: క‌న్నడంలో గ‌త ఏడాది చిన్న సినిమాగా రిలీజై క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది గ‌రుణ పురాణ మూవీ. ఎడిట‌ర్ మంజునాథ్ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సైకో కిల్ల‌ర్ మూవీని తెర‌కెక్కించాడు.

థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడు నెల‌ల త‌ర్వాత గ‌రుణ పురాణ మూవీ ఓటీటీలోకి వ‌చ్చింది. ఆమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఉచితంగా అమెజాన్‌లో చూసే వెసులుబాటు లేదు. అమెజాన్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో పాటు 79 రూపాయ‌లు రెంట్ కూడా చెల్లిస్తేనే ఈ మూవీని చూడొచ్చు.

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో...

సీరియ‌ల్ కిల్ల‌ర్ క‌థ‌తో ద‌ర్శ‌కుడు మంజునాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో మంజునాథ్‌తో పాటు సంతోష్ కార్కి, దిశ శెట్టి కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌ర్ణాట‌క బోర్డ‌ర్‌లో వ‌రుస‌గా అమ్మాయిలు హ‌త్య‌ల‌కు గురువుతుంటారు. ఈ మ‌ర్డ‌ర్స్‌కు సంబంధించి పోలీసుల‌కు ఎలాంటి ఆధారాలు దొర‌క‌వు.

దాంతో ఈ హ‌త్య‌ల‌ను సాల్వ్ చేసే బాధ్య‌త‌న సిట్ అధికారులు చేప‌డ‌తారు. ఈ హ‌త్య‌ల‌కు ఓ ముగ్గురు స్నేహితుల‌తో ఉన్న సంబంధం ఏమిటి? ప్రేమ‌లో విఫ‌ల‌మైన ఓ యువ‌కుడు సీరియ‌ల్ కిల్ల‌ర్‌గా మారాడా? అనే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు మంజునాథ్ గ‌రుణ పురాణ మూవీని తెర‌కెక్కించారు.

ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో...

లీడ్ యాక్ట‌ర్స్ ఎవ‌రూ లేకుండా డిజైన్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌తోనే ఈ మూవీ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని క‌లిగించింది. ఊహ‌ల‌కు అంద‌ని ట్విస్ట్‌ల‌తో నాన్‌లీనియ‌ర్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మంజునాథ్ ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరుకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కొత్త‌వాళ్లే అయినా న‌ట‌న బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి.

కాంత‌ర సినిమాకు ఎడిట‌ర్‌..

గ‌రుణ పురాణ మూవీతోనే ద‌ర్శ‌కుడిగా మంజునాథ్ క‌న్న‌డంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు ముందు కాంతార‌, క‌బ్జాతో పాలు ప‌లు క‌న్న‌డ సినిమాల‌కు ఆన్‌లైన్ ఎడిట‌ర్‌గా మంజునాథ్ ప‌నిచేశాడు.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను దివంగ‌త క‌న్న‌డ హీరో పునీత్ రాజ్‌కుమార్ స‌తీమ‌ణి అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ రిలీజ్ చేసింది. గ‌త ఏడాది క‌న్న‌డంలో చిన్న సినిమాల్లో మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా గ‌రుణ పురాణ నిలిచింది. గ‌రుణ పురాణ మూవీకి సీక్వెల్ తెర‌క‌కెక్కించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు మంజునాథ్ ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు.మంజునాథ్‌తో పాటు దిశా శెట్టి, సంతోష్ కార్కిల‌కు ఇదే మొద‌టి సినిమా.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్