Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..-vishal rathnam ott release date out amazon prime video to stream the movie from may 23rd ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rathnam Ott Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Rathnam OTT Release Date: విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Hari Prasad S HT Telugu
May 21, 2024 04:02 PM IST

Rathnam OTT Release Date: విశాల్ నటించిన రత్నం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఈ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగుపెడుతోంది.

విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..
విశాల్ రత్నం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. అనుకున్నదాని కంటే ముందుగానే..

Rathnam OTT Release Date: తమిళ స్టార్ నటుడు విశాల్ నటించిన మూవీ రత్నం. ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ తో ఈ రత్నం మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలుగులోనూ రిలీజైనా.. ఇక్కడ మరీ దారుణమైన కలెక్షన్లు సాధించింది. దీంతో ఈ సినిమాను నెల రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు.

రత్నం ఓటీటీ రిలీజ్ డేట్

రత్నం మూవీని మే 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. నిజానికి మే 24 నుంచి వస్తుందని ముందుగా భావించారు. కానీ ఊహించినదాని కంటే ఒక రోజు ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రైమ్ వీడియోలోనే తమిళ వెర్షన్ తోపాటు తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం.

విశాల్ నటించిన ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియా భవానీ శంకర్ కూడా నటించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైన్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. థియేటర్లలో రత్నం మూవీ మూడు వారాల్లో రూ.17.87 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో తమిళ సినిమాగా నిలిచింది. జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన కాల్వన్, విజయ్ ఆంటోనీ మూవీ రోమియో బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ రత్నం అధిగమించింది. ఈ సినిమాలో సముద్రఖని, గౌతమ్ మేనన్, యోగి బాబు, మురళీ శర్మ కూడా నటించారు.

చాలా ముందుగానే..

రత్నం మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుందని సమాచారం గతంలో వచ్చింది. మొదట ఈ సినిమా రెండు నెలల తర్వాతగానీ ఓటీటీలో రిలీజ్ చేయకూడదని భావించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఫలితం అంతంతమాత్రంగా ఉండటంతో నెల రోజుల్లోపే ప్రైమ్ వీడియో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.

ర‌త్నం క‌థ ఇదే..

ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామికి (స‌ముద్ర‌ఖ‌ని) ర‌త్నం (విశాల్ ) న‌మ్మిన బంటుగా ప‌నిచేస్తుంటాడు. ఎమ్మెల్యే అండ‌తో అవినీతి ప‌రుల ప‌ని ప‌డుతుంటాడు. ర‌త్నం జీవితంలోకి అనుకోకుండా మ‌ల్లిక (ప్రియా భ‌వానీ శంక‌ర్‌) అనే అమ్మాయి వ‌స్తుంది.

మ‌ల్లిక‌ను చంప‌డానికి లింగం బ్ర‌ద‌ర్స్ ప్ర‌య‌త్నిస్తుంటారు. క‌రుడుగ‌ట్టిన రౌడీలు అయిన లింగం బ్ర‌ద‌ర్స్ బారి నుంచి మ‌ల్లిక‌ను ర‌త్నం ఎలా కాపాడాడు? ర‌త్నం గ‌త జీవితం మొత్తం క‌ష్టాల మ‌యం కావ‌డానికి కార‌కులు ఎవ‌రు? త‌న శ‌త్రువుల‌పై ర‌త్నం ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు హ‌రి ర‌త్నం మూవీని తీర్చిదిద్దాడు.

విశాల్ లాస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి అత‌డి కెరీర్‌లోనే ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మ‌రోవైపు సింగం సిరీస్ సినిమాల‌తో పాటు ఆరు, సామీ లాంటి సినిమాల‌తో కోలీవుడ్ ఇండ‌స్ట్రీ హిట్స్‌ను అందుకున్నాడు హ‌రి. కానీ కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వ‌ద్ద హ‌రి మ్యాజిక్ పెద్ద‌గా ప‌నిచేయ‌డం లేదు.

టీ20 వరల్డ్ కప్ 2024