Prime Video OTT Top Movies: ప్రైమ్ వీడియోలో టాప్‍కు దూసుకొచ్చిన యాక్షన్ మూవీ.. టాప్-10లో ఉన్నవి ఇవే
Amazon Prime Video Top Movies: బాలీవుడ్ మూవీ యోధ ఓటీటీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం (మే 12) టాప్-10లో ఏవి ఉన్నాయంటే..
Prime Video Top Movies: బాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘యోధ’ ఓటీటీలో దుమ్మురేపుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. ఈ సినిమా ఏప్రిల్ 26న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో అడుగుపెట్టింది. అయితే, ఇటీవలే మే 11న రెంటల్ విధానం తొలగిపోయి ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరికీ ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. దీంతో యోధ మూవీకి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఈ తరుణంలో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. ప్రస్తుతం (మే 12) ప్రైమ్ వీడియోలో టాప్-10లో ఏవి ఉన్నాయో ఇక్కడ చూడండి.
యోధ
యోధ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో నేడు ఇండియా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఈ చిత్రానికి సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా సైనికుడిగా నటించారు. ఈ మూవీలో రాశీ ఖన్నా, దిశా పటానీ హీరోయిన్లుగా చేశారు. యోధ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే, మే 11వ తేదీన రెంట్ లేకుండానే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. దీంతో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.
రెండో ప్లేస్‍కు ఆవేశం
ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన సూపర్ హిట్ యాక్షన్ కామెడీ మూవీ ‘ఆవేశం’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 9వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళంలో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీపై ఫుల్ క్రేజ్ ఉండటంతో మంచి వ్యూస్ దక్కించుకుంది. ఒక్కరోజులోనే ప్రైమ్ వీడియో ట్రెండింగ్‍లో టాప్‍కు చేరింది. అయితే, యోధ సినిమా రావడంతో ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్‍లో రెండో స్థానానికి ఆవేశం చేరింది. ఆవేశం మూవీకి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.155 కోట్ల దక్కించుకొని బంపర్ హిట్ అయింది.
ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం టాప్-10లో ఇవే
- యోధ - హిందీ సినిమా
- ఆవేశం - మలయాళం మూవీ
- రోమియో - తమిళ సినిమా
- ఫ్యామిలీ స్టార్ - తెలుగు సినిమా
- యంగ్ షెల్డన్ - ఇంగ్లిష్ వెబ్ సిరీస్
- ఆపరేషన్ వాలెంటైన్ - హిందీ వెర్షన్ (తెలుగులో కూడా)
- ది ఐడియా ఆఫ్ యూ - ఇంగ్లిష్ మూవీ (తెలుగు డబ్బింగ్‍లోనూ)
- తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా - హిందీ సినిమా
- లవ్ గురు - రోమియో మూవీ తెలుగు వెర్షన్
- దిల్ దోస్తీ డైలమా - హిందీ వెబ్ సిరీస్
ఫ్యామిలీ స్టార్ జోరు
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 26వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, మూడు వారాలైనా ఈ చిత్రం ఇంకా ఓటీటీలో టాప్-5లోనే ఉంది. ప్రస్తుతం టాప్-4లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే, ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది.