Thagalaan OTT: సడెన్ సర్‌ప్రైజ్...ఓటీటీలోకి వచ్చిన విక్రమ్ తంగలాన్ - కానీ ఓ ట్విస్ట్!
Thagalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ శనివారం ఓవర్‌సీస్ ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు.
Thagalaan OTT: విక్రమ్ తంగలాన్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శనివారం నుంచి ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎంథుసన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఓటీటీలో ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే తంగలాన్ మూవీని వీక్షించే అవకాశం ఉంది. ఇండియన్ ఆడియెన్స్ తంగలాన్ మూవీని ఓటీటీలో చూడాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. తంగలాన్ హెచ్‌డీ వెర్షన్ పలు ఆన్‌లైన్ పైరసీ సైట్స్‌లో దర్శనమిచ్చి విక్రమ్ ఫ్యాన్స్‌కు షాకిచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో...
తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. సెప్టెంబర్ 20న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమిళం, తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల కానున్నట్లు చెబుతోన్నారు. తంగలాన్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
పా రంజిత్ డైరెక్టర్...
బ్రిటీషర్ల కాలంలో బలహీన వర్గాల పట్ల ఉన్న వివక్షను యాక్షన్ అడ్వెంచరస్ అంశాలతో దర్శకుడు పా రంజిత్ ఈ మూవీలో చూపించారు. తంగలాన్ మూవీలో విక్రమ్ సరసన పార్వతి తిరువోతు హీరోయిన్‌గా నటించింది. మాళవికా మోహనన్ ఓ కీలక పాత్రలో కనిపించింది.
కమర్షియల్ ఫెయిల్యూర్...
దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందిన తంగలాన్ డెబ్బై కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. విక్రమ్, పార్వతి నటనకు ప్రశంసలు దక్కాయి. తంగలాన్ పాత్రలో కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను విక్రమ్ కనబరిచాడంటూ ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి కామెంట్స్ వచ్చాయి.
తంగలాన్ కథ ఏమిటంటే?
గిరిజన తెగ నాయకుడు తంగలాన్ (విక్రమ్) భూమిని పన్ను కట్టలేదన్న సాకుతో ఊరి జమీందార్ లాక్కుంటాడు. జమీందారు నుంచి భూమిని తిరిగి సొంతం చేసుకోవడానికి బ్రిటీష్ దోర క్లైమెంట్‌తో కలిసి ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు తంగలాన్. అతడి వెంట ఊరివాళ్ల వస్తారు. అయితే బంగారు నిధిని ఆరతి (మాళవికా మోహనన్) అనే నాగజాతికి చెందిన మాంత్రికురాలు కాపాడుతుంటుంది.
ఆరతి బారి నుంచి తనవాళ్లను తంగలాన్ ఎలా కాపాడుకున్నాడు? క్లైమెంట్‌తో కలిసి బంగారు నిధిని తంగలాన్ వెలికితీశాడా? అడవిలో అడుగుపెట్టిన తంగలాన్‌కు ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయన్నదే ఈ మూవీ కథ. తంగలాన్ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ అందించాడు.
ఆగస్ట్ 15న...
తెలుగులో తంగలాన్ అదే పేరుతో రిలీజైంది. ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్‌లతో పాటు రిలీజైన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. తంగలాన్ కంటే ముందే తమిళంలో రజనీకాంత్‌తో కబాలి, కాలాతో పాటు మద్రాస్, అట్టకత్తి సినిమాలకు దర్శకత్వం వహించాడు పా రంజిత్.
మరోవైపు తంగలాన్ తర్వాత తమిళంలో వీరధీర సూరన్ అనే మూవీ చేస్తోన్నాడు విక్రమ్. ఈ సినిమాకు చిన్నా ఫేమ్ ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది చివరలో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.