Tollywood Releases This Week: ఈ వారం బాక్సాఫీస్ బరిలో ఆరు సినిమాలు - విక్రమ్‌తో మెగా హీరో పోటీ
Tollywood Releases This Week: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆరు సినిమాలు పోటీపడబోతున్నాయి. ఇందులో వైష్ణవ్‌తేజ్ ఆదికేశవతో పాటు విక్రమ్ ధృవనక్షత్రంపై ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
(1 / 5)
వైష్ణవ్‌తేజ్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఆదికేశవ మూవీ నవంబర్ 24న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మలయాళ అగ్ర నటుడు జోజు జార్ట్ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. ఈ వారం రిలీజ్ అవుతోన్న సినిమాల్లో ఆదికేశవపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. .
(2 / 5)
విక్రమ్, ఢైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ధృవ నక్షత్రం మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. అనివార్య కారణాల వల్ల గత రెండేళ్లుగా రిలీజ్ వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది
(3 / 5)
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న కోటబొమ్మాళి పీఎస్ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తేజ మార్ని దర్శకత్వం వహిస్తోన్న ఈసినిమాను జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మలయాళంలో విమర్శకుల ప్రశంసల్ని అందుకున్న నాయట్టు ఆధారంగా కోటబొమ్మాళి పీఎస్ మూవీ తెరకెక్కుతోంది.
(4 / 5)
బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ హీరోగా నటిస్తోన్న సౌండ్ పార్టీ మూవీ నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. కామెడీ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు