Thangalaan OTT: రెండు నెలల తర్వాతే ఓటీటీలోకి విక్రమ్ తంగలాన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?
Thangalaan OTT: తంగలాన్ మూవీ ఓటీటీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. ఈ పీరియాడికల్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. విక్రమ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ 35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అక్టోబర్ సెకండ్ వీక్‌లో తంగలాన్ ఓటీటీలోకి రాబోతోంది.
Thangalaan OTT: విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ రిలీజైంది. తంగలాన్ పాత్రలో విక్రమ్ నటన, అతడి లుక్‌పై ప్రశంసలు దక్కుతున్నాయి.
డీ గ్లామర్ పాత్రలో...
కమర్షియల్ హంగులకు దూరంగా డీ గ్లామర్ లుక్‌లో విక్రమ్ కనిపించిన తీరు అద్భుతమంటూ పేర్కొంటున్నారు తంగలాన్ మూవీకిగాను విక్రమ్‌తో పాటు పార్వతికి నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని, అంతలా వారు తమ పాత్రల్లో ఒదిగిపోయారని చెబుతున్నారు.
విజువల్స్, మ్యూజిక్‌తో పాటు యాక్షన్ అంశాలను బాగున్నాయని ఆడియెన్స్ చెబుతోన్నారు. తొలిరోజు తంగలాన్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విక్రమ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
నెట్‌ఫ్లిక్స్...
కాగా తంగలాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సైంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి 35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ తంగలాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రాబోతున్నట్లు చెబుతోన్నారు. అక్టోబర్ సెకండ్ వీక్‌లో ఓటీటీలో తంగలాన్‌ను ఓటీటీలో రిలీజ్ చేసేలా నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
తంగలాన్ పోరాటం...
స్వేచ్ఛ స్వాతం త్య్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటానికి నిధి అన్వేషణను జోడించి యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పా రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. తంగలాన్ కథ మొత్తం 1850 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. వేప్పూరుకు చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ (విక్రమ్) తన భార్య గంగమ్మ (పార్వతి) ఐదుగురు పిల్లలతో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు.
తంగలాన్‌పై ఊరి జమీందారు పగతో రగిలిపోతుంటాడు. పన్ను కట్టలేదని సాకుగా చూపించి తంగలాన్ భూమిని స్వాధీనం చేసుకుంటాడు. జమీందారు ఆక్రమించుకున్న భూమిని తిరిగి సొంతం చేసుకోవడం కోసం బ్రిటీషర్లతో కలిసి అడవిలో ఓ బంగారు నిధిని వెలికితీయడానికి వెళతాడు తంగలాన్.
ఆ నిధికి ఆరతి రక్షణగా నిలుస్తుంది. అసలు ఆరతి ఎవరు? బంగారం కోసం అడవిలో అడుగుపెట్టిన తంగలాన్‌తో పాటు అతడి బృందానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? బ్రిటీషర్ల వెంట వెళ్లిన తంగలాన్ వారిపై ఎందుకు ఎదురుతిరిగాడు అన్నదే ఈ మూవీ కథ.
పా రంజిత్‌పై విమర్శలు...
తంగలాన్ కాన్సెప్ట్, విక్రమ్ యాక్టింగ్ బాగున్నా...పా రంజిత్ టేకింగ్‌పై విమర్శలొస్తున్నాయి. కథాగమనం చాలా నెమ్మదిగా సాగడమే కాకుండా సెకండాఫ్‌లో దర్శకుడు కథను క్లారిటీగా చెప్పకుండా ఆడియెన్స్‌ను కన్ఫ్యూజ్ చేశాడని అంటున్నారు. తంగలాన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. కేఈ జ్ఞానవేల్ రాజాతో కలిసి పా రంజిత్ తంగలాన్ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.